City light hotel building collapsed in secunderabad

hyderabad, secunderabad, city light hotel, building collapse, rashtrapati road

Six people killed, 11 injured and 40 trapped inside as building collapses in Secunderabad.

సిటీ లైట్ హోటల్ కూలింది...

Posted: 07/08/2013 10:09 AM IST
City light hotel building collapsed in secunderabad

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈ రోజు భారీ భవన ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ లో ని సిటిలైట్ హోటల్ భవనం ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో మనకందిన  సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 6గురు మరణించిట్లు తెలుస్తుంది. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆ హోట్లలో డెబ్బై మంది వరకు ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు  ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు జి.హెచ్.ఎమ్.సి. కమిషనర్ కృష్ణబాబు చెప్పారు. ఈ సంఘటన పై అక్కడ ఉన్న స్థానికులు పలువురిని రక్షించారు. విషయం తెలియగానే పోలీసు యంత్రాంగం, జిహెచ్ఎంసి సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. సహాయ సిబ్బంది తొమ్మిది మందిని వెలికితీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే కాలం చెల్లిన భవనం కావడం వల్లనే ఈ భవనం కూలిపోయిందని అంటున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నగరంలో 272 పురాతన భవనాలు కూలడానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి కానీ జీహెంఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టే ఇలాంటి పునరావ్రుతం అవుతున్నాయని జనం అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles