Andhra cm leaders asked to prepare strategy for telangana digvijay

telangana roadmap, congress chief botsa satyanarayana, chief minister n kiran kumar reddy, congress leader digvijay singh, telangana issue, deputy chief minister damodar rajanarasimha, andhra pradesh

Andhra CM, leaders asked to prepare strategy for Telangana: Digvijay

రోడ్ మ్యాప్ ఇవ్వండి.. తెలంగాణ తీసుకోండి..దిగ్గీ

Posted: 07/05/2013 03:35 PM IST
Andhra cm leaders asked to prepare strategy for telangana digvijay

దిగ్గీబాబు రోజు రోజుకు ఊరిస్తున్నాడు. తెలంగాణ వారికి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. ‘‘పిందే పుట్టలేదు.. ఆవకాయ రుచుకోండి ’’ రెండు ప్రాంతాల నాయకుల్ని పిలుస్తున్నారు మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్‌ సింగ్. మీరు రోడ్‌మ్యాప్‌ ఇవ్వండి..? తెలంగాణ తీసుకోండి అని చాలా తెలిగ్గా చెబుతున్నారు. తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణలను రోడ్‌మ్యాప్‌ సమర్పించమని కోరినట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ తెలిపారు. వారు నివేదిక సమర్పించిన తర్వాత సోనియాగాంధీ ఇతర ముఖ్య నేతలతో చర్చించిన తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అంతకు ముందు దిగ్విజయ్‌ సింగ్‌ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ అయ్యారు. ఆ తర్వాత తెలంగాణపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి తెలంగాణకు సాధ్యమైనంత తొందరగా పరిష్కారం చూపాలంటూ దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ గురించి ఎలాంటి అయోమయం లేదని.. రాజ్యాంగ ప్రక్రియ ప్రకారమే విభజన జరుగుతుందని అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles