Mopidevi was asked to turn approver against jagan

Mopidevi was asked to turn approver against Jagan, mopidevi harinadh, congress party, ys jagan, ysr congress party, congress minister,

Mopidevi was asked to turn approver against Jagan

మోపిదేవి కోవర్టుగా మారితేనే సాయం : కాంగ్రెస్ పార్టీ

Posted: 07/05/2013 03:44 PM IST
Mopidevi was asked to turn approver against jagan

మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కుటుంబం ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పింది. కాంగ్రెస్ పార్టీ వలన మోపిదేవి కుటుంబానికి చాలా నష్టం జరిగిందని ఆయన సోదరుడు హరినాథ్ బాబు అంటున్నారు. కాంగ్రెస్‌లో న్యాయం జరగదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరినాధ్ బాబు తెలిపారు. ఆయన పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఆయన మాట్లాడుతూ 25 ఏళ్లగా పార్టీకి సేవ చేస్తే.... కాంగ్రెస్ మాత్రం తన అన్నను మోసం చేసిందని ఆరోపించారు. బీసీలమయినందునే తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ తీరుపై విసిగిపోయే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. ఆరోగ్యం బాగోలేదన్నా తన సోదరుడిని కనికరించలేదని హరినాధ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సాయం కోసం మంత్రి కొండ్రు మురళిని బతిమాలినా పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. మోపిదేవిని కోవర్టుగా మారమని కాంగ్రెస్ మహిళ మంత్రి సూచించారని ఆయన తెలిపారు. తన సోదరుడు కోవర్టుగా మారితే సాయం చేస్తామని ఆ మహిళ మంత్రి చెప్పారన్నారు. వైద్యం కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు కూడా పట్టుకున్నామని హరినాధ్ బాబు తెలిపారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles