Ap panchayat elections notification and schedule released

AP Panchayat Elections Notification and Schedule Released,

AP Panchayat Elections Notification and Schedule Released

పంచాయతీ ఎన్నికల నగారా మోగింది

Posted: 07/03/2013 05:27 PM IST
Ap panchayat elections notification and schedule released

సంవత్సరాలు తరబడి పెండింగ్ లో ఉన్న పంచాయతీ ఎన్నికల్ని నిర్వహంచే సాహసం చేసింది మన సర్కార్ . ఈ రోజు రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల నోటిఫికేఫన్ ను విడుదల చేశారు. ఈ నెల 9న జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలిపారు. మొత్తం రాష్ట్రంలోని 21, 491 పంచాయతీ లకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం గ్రామ పంచాయతీల్లో 2,17,578 వార్డులకు పోలీంగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరక పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ల స్వీకరణకు ఈనెల 13 చివరితేది . నామినేషన్ల పరిశీలన ఈనెల 14, ఉపసంహరణకు ఈనెల 17 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ రోజు నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. ఫలితాలు విడుదలయ్యే వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని రమాకాంత్ రెడ్డి తెలిపారు. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు గ్రేటర్ లో కలిపే పంచాయతీలకు ఎన్నికల నుంచి మినహాయింపు ఉంటుందని ఈసీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles