Tdp mla revanth reddy fire on political parties

tdp mla revanth reddy fire on political parties, senior ntr photo, tdp, telugu desam party, ntr photo use, tdp leaders, congress party, ysrcp,

tdp mla revanth reddy fire on political parties

ఫోటోలు పెడితే చెప్పుతో కొట్టండి ?

Posted: 06/29/2013 07:34 PM IST
Tdp mla revanth reddy fire on political parties

ఇటీవల కాలంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు సీనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకున్నాయి. దీనిపై అనేక విమర్శలు వినిపిస్తునే ఉన్నాయి. అయితే ఈ సారి అలాంటి పార్టీలపై టిడిపి నాయకులు సీరియస్ గా స్పందించారు. పిల్ల కాంగ్రెస్ నేతలు తమ బ్యానర్లలో ఎన్టీఆర్ ఫోటో పెడితే చెప్పుతో కొట్టండి అని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో 1994 ఫలితాలు పునరావృత్తం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా కాంగ్రెస్ పార్టీ మరింత జఠిలం చేస్తోందని మండిపడ్డారు. వైఎస్ తన కుమారుడు నెంబర్ వన్‌గా ఉండాలని కోరుకున్నారని, ఇప్పుడు చంచల్‌గూడా జైళ్లో వైఎస్ జగన్ నెంబర్ వన్ గానే ఉన్నారని రేవంత్‌రెడ్డి యెద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఫోటో ను ఎవరు పెట్టుకోవటానికి వీల్లేదని టిడిపి నాయకులు అంటున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నందమూరి ఎన్టీరామారావు రెండో భార్య లక్ష్మీపార్వతి కూడా సైలెంట్ గా ఉన్నట్లు సమాచారం. గతంలో ఎన్టీఆర్ ఫోటోను ఎవరైన పెట్టుకోవచ్చు అంటూ పలికిన లక్ష్మీపార్వతి ఈ సారి మాత్రం సైలంటుగా ఉన్నట్లు సమాచారం.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles