Tree collapse at secretariat cm kiran kumar reddy escapes

tree collapse in secretariat, kiarn kumar reddy escapes, tree falls in secretariat cm kiran escaped, tree collapse in cm convoy, tree fall on his cars , narrow escape , secretariat ,seemandhra lobby , scorpio cars , samata block, breaking news, ap politics, political news, andhra news

Tree collapse at secretariat, CM Kiran kumar reddy Escapes

సిఎం కాన్వాయ్ పై కూలిన భారీ చెట్టు..

Posted: 06/29/2013 04:26 PM IST
Tree collapse at secretariat cm kiran kumar reddy escapes

సిఎం కాన్వాయ్ పై భారీ చెట్టు ఈ రోజు కూలిపడింది. ఈ ప్రమాదంలో ప్రాణం నష్టం లేదు..కానీ ఒక కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లుతున్నప్పుడు జరిగిన సంఘటన కాదులేండి. ఈ సంఘటన జరిగింది నగరంలోనే.. సచివాలయంలోని సమత బ్లాక్ వద్ద సీఎం కాన్వాయ్ నిలిపి ఉంచారు. ఆ సమయంలో భారీ చెట్టు కూలింది. ఈ ప్రమాదంలో మురళీ క్రిష్ణ అనే కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి.

 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి వాహనం పూర్తిగా ద్వంసం కాగా... సీఎం కాన్వాయ్ లోని జామర్ వాహనం , అంబులెన్స్ పాక్షికంగా దెబ్బ తిన్నాయి. అయితే ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బంది గది పూర్తిగా ధ్వంసమైంది. గాయాల పాలైన కానిస్టేబుల్ మురళీ క్రిష్ణ ను గ్లోబల్ ఆసుప్రతికి తరలించారు.

 

అయితే ఈ భారీ చెట్టు అంత సడన్ ఎందుకు కూలింది అనే విషయం ఎవరికి అర్థం కావటం లేదు. ఈ ప్రమాదం నుండి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తప్పించుకున్నారని అధికారులు అంటున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh