Minister chiranjeevi announces rs 100 crore relief package for uttarakhand

chiranjeevi announces rs 100 crore relief package for uttarakhand, minister chiranjeevi, tourism minister chiranjeevi, uttarakhand flood victims, mplads for uttarakhand flood victims, breaking news, ap politics, political news, andhra news

Minister Chiranjeevi Announces Rs 100 Crore Relief Package For Uttarakhand

ఉత్తరాఖండ్‌ పునర్నిర్మాణానికి 100 కోట్లు : మంత్రి చిరంజీవి

Posted: 06/27/2013 01:33 PM IST
Minister chiranjeevi announces rs 100 crore relief package for uttarakhand

 

 

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని చార్‌ధామ్‌లో జరిగిన ఘోర ప్రకృతి విపత్తులో నష్టాన్ని పూడ్చేందుకు కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేకంగా వంద కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 95 కోట్ల రూపాయలను విడుదల చేయగా, దీనికి అదనంగా మరో వంద కోట్లను తన శాఖ ద్వారా పునర్మిర్మాణం కోసం కేటాయిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి కె.చిరంజీవి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని కావలసిన సదుపాయాలను పూర్తి స్థాయిలో అంచనా వేసి ఇంకా ఎంతమేర నిధులు అవసరమో తెలిపితే ఆమేరకు నిధులను మంజూరు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన నిధులను ప్రభుత్వ హోటళ్ళ నిర్మాణం, మౌలిక సదుపాయాలు, పర్యాటకులకు వసతి సౌకర్యాలు, సహాయక శిబిరాలను ఏర్పాటు చేసేందుకు వినియోగించాలని ఆయన కోరారు. దేశంలోని హోటల్‌ పరిశ్రమ యాజమాన్యాలు, టూర్‌ ఆపరేటర్లు, ట్రావెల్‌ ఏజెంట్లతో గత వారం రోజులుగా సుదీర్ఘంగా జరిపిన చర్చల్లో బాధితులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలను పంపవలసిందిగా కోరినట్లు తెలిపారు. అలాగే తన ఎంపీ నిధులనుండి ఒక కోటి రూపాయలు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి సహాయంగా పంపినట్లు తెలిపారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles