Nelson mandela condition worsens

Nelson Mandela condition worsens,

Nelson Mandela condition worsens

వెంటిలేటర్‌పై మండేలా

Posted: 06/27/2013 01:41 PM IST
Nelson mandela condition worsens

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను వెంటిలేటర్‌ ఉంచినట్లు ప్రిటోరియా హార్ట్‌ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సన్నిహితులు ధృవీకరించారు. మండేలా కుటుంబానికి అత్యంత ఆప్తులైన ఇద్దరు వ్యక్తులు ఆయనను దర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ, మండేలా ఆరోగ్యం పూర్తిగా విషమించిందని, వెంటిలేటర్‌ సహాయంతో ప్రాణవాయువు అందిస్తున్నారని పేర్కొన్నారు. కాగా మండేలా ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన మీదట తదుపరి చర్యలపై అబా తెంబు జాతి పెద్దల మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా మండేలా కిడ్నీలు పనిచేయడం లేదని, అందువల్ల ప్రతి రెండురోజులకు ఒకసారి మూడు గంటలపాటు డయాలసిస్‌ చేయాల్సి వస్తోందని ఓ పత్రిక పేర్కొంది. మండేలాలను పరిశీలించిన వివిధ ప్రత్యేక డాక్టర్ల బృందం పరిస్థితిపై నిరుత్సాహమైన ప్రకటనచేసింది. కృత్రిమశ్వాసను నిలిపివేయడం మినహా తాము చేయగలిగిందేమీ లేదని తేల్చిచెప్పింది. కాగా, డాక్టర్ల సలహాపై ఆయన కుమార్తె మెకంజీ స్పందిస్తూ, తమ కుల పెద్దలు వచ్చిన తర్వాత, వారు ఎలా నిర్ణయిస్తే అలా చేయండని చెప్పింది. మండేలా వెంటిలేటర్ పై ఉండగానే కుల పెద్దలు , కుటుంబం సభ్యుల మద్య మండేలా అంత్యక్రియ విషయం పెద్ద వివాదంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles