I will not give any dead line for telangana digvijay singh

digvijay singh, telangana, kiran kumar reddy, sonia gandhi, new delhi,

State Congress Party incharge Digvijay Singh on Wednesday said he will not give any dead line for Telangana.

కొత్త డెడ్ లైన్ పెట్టను - నిర్ణయం ఎప్పుడో చెప్పలేను

Posted: 06/27/2013 09:02 AM IST
I will not give any dead line for telangana digvijay singh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టిన దిగ్విజయ్ సింగ్ తెలంగాణ అంశం పై ఆచితూచి మాట్లాడుతున్నారు. గత రెండు రోజుల నుండి తెలంగాణ పై ఏదో ఒకటి తేలబోతుందనే వార్తలు గుప్పుమనడంతో ఈ విషయం పై ఆయన ముఖ్యమంత్రి కిరణ్ తో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ... తెలంగాణ నిర్ణయం పై ఇంకా కొత్త డెడ్ లైన్ పెట్టలేదని, ఇప్పటికే తెలంగాణపై అనేక డెడ్‌లైన్లు పెట్టామని, తాను కూడా అలా డెడ్ లైన్ పెట్దదలచుకోలేదని ఆయన స్పష్టం చేయడమే కాకుండా, ఎప్పటికి నిర్ణయం తీసుకుంటామో చెప్పలేమని అన్నారు. తెలంగాణపై తమకంతా తెలుసని, అయితే, నిర్ణయం ఎప్పుడొచ్చేదీ తాను చెప్పలేనన్నారు. కొత్త ఇంఛార్జిగా వచ్చిన ఈయన కూడా ఇలా మాట్లాడటం పై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. గతంలో హోంమంత్రి నెల రోజులు గడువు పెట్టి ఆ తరువాత అభాసు పాలయ్యారు. ఈయన అలా కాకుండా జాగ్రత్తపడుతున్నారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles