Political bullet proof car for bjp mla kishan reddy

bullet proof car for mla kishan reddy, g kishan reddy, pakistan terrorism, bjp party, state government, kiran kumar reddy, bjp led by state party president kishan reddy, breaking news, ap politics, political news, andhra news

Bullet proof car for mla kishan reddy

కిషన్‌రెడ్డికి బుల్లెట్‌...

Posted: 06/26/2013 12:55 PM IST
Political bullet proof car for bjp mla kishan reddy

అంబర్‌పేట ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్‌ ప్రూఫ్‌ అంబాసిడర్‌ కారు కేటాయించింది. కిషన్‌రెడ్డి పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉండడంతో ఆయన భద్రత కోసం ప్రభుత్వం ఇటీవల సిబ్బందిని కూడా పెంచింది. బర్కత్‌పురాలో కిషన్‌రెడ్డి నివాసమున్నప్పుడు ఆయన ఉండే అపార్ట్‌మెంట్‌ వద్ధ ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించిన సంఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. దీనితో ప్రజా జీవితంలో ఉన్న ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి తగినంత భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బుల్లెట్‌ ప్రూఫ్‌ అంబాసిడర్‌ కారు కేటాయించింది. కిషన్‌రెడ్డిని చంపుతామంటూ గతంలో ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్‌కాల్స్‌ వచ్చిన సంఘటనలు కూడా అనేకం జరిగాయి. దీనితో స్పందించిన ప్రభుత్వం గత కొంతకాలంగా ఆయనకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. కిషన్‌రెడ్డి భద్రతకు ప్రభుత్వం బుల్లెట్‌ ప్రూఫ్‌ అంబాసిడర్‌ కారు ఇచ్చినందుకు బిజెపి సీనియర్‌ నాయకుడు శ్రీనివాస్‌ ముదిరాజ్‌ ప్రభుత్వానికి దన్యవాదాలు చెప్పారు. అదే విధంగా కిషన్‌రెడ్డికి పోలీస్‌ ఎస్కార్ట్‌ కూడా కల్పించాలని ఆయన కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles