Uttarakhand flood victims gang rape

uttarakhand flood victims gang rape, mother and daughter gang rape in uttarakhanda,

uttarakhand flood victims gang rape

బధ్రీనాథ్ లో వరదబాధితులపై కామాంధులు?

Posted: 06/26/2013 01:41 PM IST
Uttarakhand flood victims gang rape

వరద నుండి తప్పించుకున్న బాధితులను, దొంగలు, కామాంధులు కాటేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న బాధితుల తన మాన ప్రాణాలను దోచుకుంటున్నారు. జల విలయం నుంచి బయపడ్డా తల్లీకూతుళ్లు కామాంధుల కాటుకు బలయ్యారు. వరదల్లో చిక్కి జీవచ్ఛవాలుగా మారారన్న కనికరం కూడా లేకుండా ఆ దుర్మార్గులు తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం వారిని దారుణంగా హతమార్చారు. వరదల్లో చిక్కుకోవడంతో ఈ తల్లీకూతుళ్లు పదిరోజుల పాటు బద్రీనాథ్‌లోనే తలదాచుకున్నారు. హెలికాఫ్టర్ ద్వారా తరలింపు ఆలస్యం అవుతుండటంతో కాలినడక జోషిమఠ్‌కు బయలుదేరారు. పాండుకేశ్వర్ సమీపంలో వీరిని అటకాయించిన కామాంధులు రోడ్డు పక్కన ఉన్న పర్వతాల్లోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై హత్య చేసి వారి వద్ద ఉన్న సొత్తు, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసు, సైనిక దళాలు ఇకపై ఎవ్వరినీ ఒంటిరిగా పంపకూడదని నిర్ణయించాయి. మరుభూమిగా మారిపోయిన కేదార్‌నాథ్‌లో కొందరు దొంగలు శవాల వద్ద నుంచి కూడా దోపిడీ చేస్తుండగా... బద్రీనాథ్ సమీపంలో కామాంధులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఉత్తరాఖండ్‌లోని పాండుకేశ్వర్ సమీపంలోని కొండలపై చిక్కుకున్న యాత్రికుల కోసం గాలింపు చేపడుతున్న ఆర్మీ బృందాలు వీరి మృతదేహాలను గుర్తించాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles