Political minister danam nagender fire on chandrababu naidu

Minister Danam Nagender, congress party, tdp chief Chandrababu Naidu, uttarakhan flood victims, congress party, delhi ap bhavan, telugu people, cm kiran kumar reddy, minister danam

Minister Danam Nagender fire on Chandrababu Naidu

బాబు శవరాజకీయాలు మానుకో : దానం

Posted: 06/25/2013 10:32 AM IST
Political minister danam nagender fire on chandrababu naidu

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శవరాజకీయాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ విమర్శించారు. ప్రకృతి విపత్తు జరిగిన ఇన్ని రోజులకు స్పందించిన టీడీపీ అధినేత.. ఢిల్లీలో నానా హంగామా చేయడం దురదృష్టకరమన్నారు. సీఎల్పీ కార్యాలయంలో దానం అన్నారు. తనతో పాటు మరో మంత్రి డి.శ్రీధర్‌బాబు, కేంద్ర మంత్రి బలరాంనాయక్ రాష్ట్ర పర్యాటకులకు పూర్తి స్థాయిలో సహాయం అందజేశామని చెప్పారు. ఇవేవీ గమనించకుండా చంద్రబాబు శవరాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ‘నరేంద్రమోడీకి కితాబు ఇచ్చిన చంద్రబాబు రాష్ట్ర సేవలను ప్రస్తావించకుండా కించపర్చారు. అమెరికా నుంచి రాగానే డ్రామాలు మొదలుపెట్టిన చంద్రబాబు తీరును ప్రతి ఒక్కరూ చీదరించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత హడావుడి చేస్తున్న చంద్రబాబు అమెరికాలో ఉండగా ఏం చేశారు? వారి పార్టీ ఎంపీలను ఎందుకు సహాయ చర్యలకు పంపలేదు? ఇప్పుడు పరామర్శిస్తున్న సమయంలోనూ పార్టీ జెండాలతో హంగామా చేయడం ఆయనకే చెల్లింది. తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా’ అని ప్రశ్నించారు. ముందస్తుగా రూపొందించుకున్న పర్యటనల వల్లే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉత్తరాఖండ్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లలేదని, అవసరమున్న పక్షంలో సీఎం వెళ్తారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles