Fears grow for nelson mandelas health

nelson mandela, fears grow for nelson mandelas health, south african president nelson mandela, 94-year-old,

Fears grow for Nelson Mandelas health

విషమంగా మారిన నెల్సన్ మండేలా ఆరోగ్యం

Posted: 06/25/2013 10:37 AM IST
Fears grow for nelson mandelas health

 94 ఏళ్ల దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా గత కొంతకాలంగా ఊపరితిత్తులు సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. నెల్సన్ మండేలా ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు ఆ దేశ అధ్యక్షుడు జాకబ్ జుమా ప్రకటించారు. ఆయన ఊపిరితిత్తులు సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారని, వైద్యులు చికిత్స చేస్తున్నప్పటికీ మండేలా ఆరోగ్యం మెరుగుపడక పోగా మరింత విషమంగా మారిందన్నారు. దీంతో దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ జాకబ్ జూమా ప్రిటోరియాలోని రామ్ ఫోసా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మండేలాను పరామర్శించారు. దేశ ప్రజలంతా నెల్సన్ ఆరోగ్యం కుదుట పడాలని కోరుతూ ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారుఇదిలావుండగా, నెల్సన్ మండేలా ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు అధికార ప్రతినిధి మాక్ మహారాజ్ కూడా ప్రకటించిన విషయం తెల్సిందే. ముఖ్యంగా గత 24 గంటల్లో మండేలా ఆరోగ్యం మరింతగా క్షీణించినట్టు వైద్యులు తెలిపారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles