Uttarakhand flood bjp postpones all india jail bharo agitation

BJP, Jail Bharo Andolan, BJP president Rajnath Singh, Uttarakhand flood, mla kishan reddy, trs party,

BJP postpones all India jail bharo agitation,

'జైల్ భరో' వాయిదా - ఉప్పెనలా వస్తున్న జనం?

Posted: 06/22/2013 07:29 PM IST
Uttarakhand flood bjp postpones all india jail bharo agitation

బీజేపీ 'జైల్ భరో' ఆందోళన కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. ఉత్తరాఖండ్ వరదలు నేపథ్యంలో 'జైల్ భరో'ను వాయిదా వేసినట్టు బీజేపీ తెలిపింది. యూపీఏ అవినీతి పాలనకు వ్యతిరేకంగా మే 27 - జూన్ 2 మధ్య దేశవ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టాలని బీజేపీ ముందుగా నిర్ణయించింది. అయితే ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టులు దాడితో వాయిదా వేసింది. ఈనెల 17 - 30 మధ్య 'జైల్ భరో' నిర్వహించాలని భావించింది. ఆందోళన బదులు ఉత్తరాఖండ్ లో వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కార్యకర్తలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. అయితే ఆగస్టు నెలల్లో ఉప్పెనలాగా తమ పార్టీలోకి చేరికలు ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇతర పార్టీల నుంచి భారీ సంఖ్యలో నేతలు వలస వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మికుంట మాజీ జడ్పీటీసీ విజయ, ఎంపీటీసీ గణపతి నేడు బీజేపీలో చేరారు. టీఆర్ఎస్‌ వల్ల తెలంగాణ రాదని బీజేపీలో చేరినట్టు విజయ, గణపతి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles