Tdp mlc rajendra prasad comment on trs mla ktr

tdp mlc rajendra prasad, tdp mlc rajendra prasad comment on trs mla ktr, tdp vs trs, kcr vs chandra babu, rajendra prasad vs ktr, telugudesam party, telangan issue, congress party, andhrajyothy paper news,

tdp mlc rajendra prasad comment on trs mla ktr

రాజేంద్ర ప్రసాద్ దెబ్బకు కెటిఆర్ మైండ్ బ్లాంక్ ?

Posted: 06/22/2013 07:17 PM IST
Tdp mlc rajendra prasad comment on trs mla ktr

గత కొన్ని రోజుల నుండి తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల మద్య యుద్ద వాతావరణం నెలకొంది. ఇరుపార్టీల నాయకులు ఘాటైన మాటలతో యుద్దం చేస్తూ మీడియాకు, పత్రికల వారికి పనికల్పిస్తున్నారు. రీసెంట్ గా ఆంద్రజ్యోతి పేపర్లో కేసిఆర్ కొడుకు కేటిఆర్ వచ్చిన వార్తలు, టీడిపి మంచి ఆయుధం దొరికనట్లు అయ్యింది. ఇలాంటి ఇరుపార్టీల నాయకులు వారి మగతనం గురించి రోడ్డునపడ్డారు. మగాడు, మగతనం లాంటి పదునైన మాటాలతో ఇరుపార్టీల నాయకులు మీడియా ముందు రెచ్చిపోతున్నారు. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి నేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామరావుపై వచ్చిన సెటిల్‌మెంట్ కథనాలతో ఆయన మైండ్ బ్లాంక్ అయిందని టిడిపి మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు.దాంతో కెటిఆర్ కు ఏం మాట్లాడాలో తెలియక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వారు స్లిప్‌లు తీసుకుని మాట్లాడారని ఆయన విమర్శించారు. కేటీఆర్‌కు మగతనం ఉంటే తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ కోరాలని సవాల్ చేశారు. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ను కెటిఆర్‌ మగాడివైతే విచారణకు సిద్దం కావాలని కెటిఆర్ సవాల్ చేసిన నేపధ్యంలో రాజేంద్రప్రసాద్ అదే సవాల్ ను ఈయనకు విసిరినట్లుగా ఉంది. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మొత్తం మీద చంద్రబాబుపై చేసిన సవాళ్లకు ప్రతిగా రాజేంద్ర ప్రసాద్ సవాల్ విసరడానికి ఈ అవకాశం వినియోగించుకున్నారు. రాజేంద్రప్రసాద్ చేసిన సవాళ్లకు టిఆర్ఎస్ పార్టీలో ఏ నాయకుడు ప్రతి సవాల్ విసురుతారో చూడాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh