Cpi narayana backs dasari narayan rao

cpi narayana, cpi state secretary k. narayana, cpi narayana dharna, coal scam, director dasari narayana, ex minister dasari narayana,

CPI Narayana backs Dasari Narayan Rao

బొగ్గురత్నకు ఎర్ర నారాయణ అండ!

Posted: 06/22/2013 06:46 PM IST
Cpi narayana backs dasari narayan rao

హైదరాబాద్ బంజారాహిల్స్ రిలయన్స్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆందోళనకు దిగింది. కేజీ బేసిన్ లో అక్రమాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తలుధర్నా చేపట్టారు. నారాయణ మాట్లాడుతూ రిలయన్స్ చెప్పినట్లే కేంద్రం నడుచుకుంటోందని ఆరోపించారు. బొగ్గు కుంభకోణంలో అసలు మద్దాయి ప్రధాని మన్మోహన్ సింగ్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఆయనను వదలి మాజీ మంత్రి దాసరి నారాయణరావు పై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని నారాయణ ప్రశ్నించారు. రిలయన్స్ సంస్థ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో దర్నా జరిగింది. రిలయన్స్ కు భారత్ దాసోహం అవుతోందని ఆయన ఆరోపించారు. కెజి గ్యాస్ బేసిన్ లో వేల కోట్ల రూపాయలను రిలయన్స్ లూఠీ చేస్తున్నదని ఆయన మండిపడ్డారు.దీని సంగతి ఎలా ఉన్నా దాసరి నారాయణ తరపున నారాయణ మాట్లాడడం ఆసక్తికరంగా ఉంది. కాంగ్రెస్ నేతలు కాని, టిడిపి నేతలు కాని, మరే పార్టీ నేతలు కాని ఇంతవరకు మన రాష్ట్రంలో దాసరిని విమర్శించలేదు. అయితే నారాయణ మాత్రం దాసరికి పరోక్షంగా అండగా నిలుస్తూ ప్రధానిపై విమర్శలు చేయటం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles