Mp lagadapati rajagopal comment on telangana package

mp lagadapati rajagopal, congress party, vijayawad mp, telangana isse, telangana package, telangana state, andhrapradesh,

mp lagadapati rajagopal comment on telangana package

తెలంగాణకు ప్యాకేజీలే : లగడపాటి

Posted: 06/22/2013 06:37 PM IST
Mp lagadapati rajagopal comment on telangana package

సమైక్య వాదిగా పేరు తెచ్చుకున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ పై ఒక నిర్ణయం చెప్పారు. రీసెంట్ గా తెలంగాణ పై వినిపిస్తున్నా మాటల ప్రకారం లగడపాటి చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్రం నుండి తెలంగాణ పై ఎలాంటి ప్రకటన రాకముందే .. రాష్ట్రంలో కన్ని పుకార్లు స్వయం విహరం చేస్తున్నాయి. తెలంగాణ కు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వటానికి కేంద్రం సిద్దమైనట్లుగా రెండు ప్రాంతాల నాయకుల్లో కొత్త అలజడి మొదలైంది. ఇరు ప్రాంతాల నాయకులు ప్యాకేజీలపై మాటలు యుద్దం చేస్తున్నారు. ఈ రోజు ఎంపీ లగడపాటి కూడా తన మనస్సు లో మాటను బయటపెట్టారు. రాష్ట్రంలో భావోద్వేగాలు సమసిపోయాయనిలగడపాటి రాజగోపాల్ అన్నారు. అభివృద్ధి చెందని అన్ని ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని ఆయన అన్నారు. తెలంగాణకు ప్యాకేజీ లే మంచిదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లోకి ఏ పార్టీ వచ్చిన స్వాగతిస్తామని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే ఎన్నికల్లోను కాంగ్రెస్ విజయం సాధిస్తుందని రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh