Keshav rao takes over as trs general secretary

k keshav rao, telangana rashtra samithi, k chandrasekhara rao, general secretary, congress, mamata banerjee, federal front

TRS chief K. Chandrasekhara Rao has appointed former senior leader of the Congress party K. Keshav Rao as Telangana Rashtra Samithi general secretary and as head of the national affairs committee of the party.

కేకేకు పార్టీలో పెద్దపీట

Posted: 06/19/2013 10:08 AM IST
Keshav rao takes over as trs general secretary

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉండి అనేక పదవులు అనుభవించిన కే.కేశవరావు తెలంగాణ సెంటిమెంటుతో  టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేశవరావుకు ఆ పార్టీలో పెద్దపీటే వేస్తున్నారు. కె.కేశవరావును పార్టీ సెక్రటరీ జనరల్‌గా, జాతీయ వ్యవహారాల సమన్వయ కమిటీ చైర్మన్‌గా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల సమక్షంలో నియమించారు. ఈ సందర్భంగా కేకేను తనకు కేటాయించిన ప్రత్యేకమైన ఛాంబర్లోని సీట్లో కేసీఆర్ స్వయంగా కూర్చోబెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ "నా కుడి పక్కన కేకే, ఎడమ వైపు కడియం ఉన్నారు. మేం భిన్నమైన పార్టీల్లో ఉండేవాళ్లం. భిన్నమైన దృక్పథాలు కలిగి ఉన్న వాళ్లం. తెలంగాణ అనే ఒక్క అంశం మమ్మల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది'' అని కేసీఆర్ చెప్పారు. కేకేకు పదవి ఇచ్చేంత పెద్దవాడిని కాదని, ఆయనకున్న శక్తి సామర్థ్యాలు తనకు లేవని చెప్పారు. కేకేకు తాను పెద్ద అభిమానిని అని కేకే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికై కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్నప్పుడు నేను ఎంఎ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్‌గా ఉండేవాడిని. ఆయన కౌన్సిల్‌లో చేసే ప్రసంగాలు వినాలని ఆరాటపడేవాడిని. ఎలాగోలా పాస్ సంపాదించుకొని కౌన్సిల్ గ్యాలరీలో కూర్చొని ఆయన స్పీచ్ వినేవాడిని అని చెప్పారు. ఆయన పార్టీ జాతీయ వ్యవహారాల సమన్వయ కమిటీ చైర్మన్‌గా ఉండటం తమకెంతో లాభం కలిగిస్తుందన్నారు. పార్టీలో అన్ని విషయాలలో కె.కేశవరావు కలగచేసుకుని పనిచేయాలని కోరుతున్నా నిని చంద్రశేఖరరావు  చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles