Political minister kanna lakshminarayana comment on tdp party

minister kanna lakshminarayana, kanna, congress party, andhra pradesh, cbi, congress, gali muddukrishnama naidu,mallu bhatti vikramarka, n. kiran kumar reddy, newstracker, p ashoka gajapati raju, tdp, telugu desam party, minister geetha reddy, breaking news, ap politics, political news, andhra news

minister kanna lakshminarayana comment on tdp party

టీడీపీ దొంగల పార్టీ

Posted: 06/18/2013 04:35 PM IST
Political minister kanna lakshminarayana comment on tdp party

తెలుగుదేశం పార్టీ పై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. నిన్న మంత్రి గీతారెడ్డి చంద్రబాబు పై ఘాటైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ దొంగల పార్టీ అని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నారాయణ ఘాటుగా విమర్శించారు. అనేక పథకాల ద్వారా టీడీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని, టీడీపీ చరిత్ర అంతా తన దగ్గర వుందని అన్నారు. జన్మభూమి, పనికి ఆహారపథకం, స్టాంపులు, స్కాలర్‌షిప్పుల్లో టీడీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తులో తన ప్రస్తావన లేదన్నారు. తనపై తప్పుడు రాతలు రాయిస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గాలి పోగు చేసి తనపై ఆరోపణలు చేయించారని వాపోయారు. టీడీపీ సీనియర్ నేత అశోక్‌ గజపతి రాజు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని మంత్రి కన్నా విమర్శించారు. టిడిపి నాయకులు కళంకిత మంత్రులను సభ నుండి బయటకు పంపించాలని డిమాండ్ చెయ్యటంతో సభలోగందరగోళం నెలకొల్పింది. ఆ సమయంలో కళంకిత మంత్రులు అని ఎందుకు అంటున్నారు. మీకు ఎవరు చెప్పారు మేము కళంకిత మంత్రులని కాంగ్రెస్ మంత్రులు మండిపడ్డారు. ఆరోపణలు వచ్చినంత మాత్రన కళంకిత మంత్రులు అవుతారా? అయితే చంద్రబాబు కూడా కళంకిత నాయకుడేనని కాంగ్రెస్ మంత్రులు టిడిపి పార్టీ పై దుమ్మేత్తి పోశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles