Smile train patient pinki sonkar to flip coin at wimbledon

smile train patient pinki, wimbledon,pinki sonkar, pinki sonkar, smile train, sports, tennis, wimbledon 2013, breaking news, ap politics, political news, andhra news

Smile Train patient Pinki Sonkar to flip coin at Wimbledon

భారతీయ బాలికకు అరుదైన అదృష్టం

Posted: 06/18/2013 04:27 PM IST
Smile train patient pinki sonkar to flip coin at wimbledon

భారత్‌కు చెందిన 11 ఏళ్ల పింకిని అరుదైన అదృష్టం వరించింది. వచ్చే నెల 7న జరిగే వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆమె టాస్ వేసే అవకాశాన్ని దక్కించుకుంది. అంతేకాదు ఆమె గౌరవార్థం బ్రిటిష్ హైకమిషనర్ జేమ్స్ బేవాన్ ఇచ్చే విందులోనూ అతిథిగా పాల్గొననుంది. గ్రహణమొర్రితో జన్మించిన ఈ బాలిక శస్త్రచికిత్సతో మంచి రూపును సంతరించుకుంది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ‘స్మైల్ ట్రెయిన్’ చారిటీ సంస్థ ఈ సర్జరీకి చేయూతనిచ్చింది. 2007లో ఈ చారిటీ పింకికి డాక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ నేతృత్వంలో శస్త్రచికిత్స చేయించింది. అనంతరం ఈ సంస్థ ఆమె ఇతివృత్తంతో తీసిన ‘స్మైల్ పింకి’ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించింది. దీనికి ఆస్కార్ అవార్డు లభించింది. భారత చిన్నారి స్వయంగా ఆ అవార్డును అందుకుంది. ఈ నేపథ్యంలో ఆమె సర్జరీ, అకాడమీ అవార్డు విన్నింగ్ అనుభూతుల్ని ఇంగ్లండ్, అమెరికా దేశాల్లో పంచుకొనేందుకు బయల్దేరనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh