Political devineni uma comment on minister chiranjeevi

minister chiranjeevi, devineni uma, tdp mla, comments, on central tourism minister, chiranjeevi, uttarakhand state, andhra pradesh tourists, struggling in rains, cm kirankumar reddy, breaking news, ap politics, political news, andhra news

devineni uma comment on minister chiranjeevi

మంత్రి చిరంజీవి నిద్రపోతున్నారా ?

Posted: 06/17/2013 03:21 PM IST
Political devineni uma comment on minister chiranjeevi

కేంద్ర పర్యాటశాఖ మంత్రి చిరంజీవి పై తెలుగుదేశం పార్టీ మండిపడుతుంది. ఉత్తరాఖండ్ లో చిక్కుకుని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర మంత్రి చిరంజీవి నిద్రపోతున్నారా ? అని టిడిపి ఎమ్మెల్యే దేవినేని ఉమ ప్రశ్నించారు. ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవడంలో మంత్రి చిరంజీవి విఫలం చెందారని, వారిని రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాత్రికులని క్షేమంగా తిరిగి వచ్చే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న తెలుగు ప్రజలకు కోసం ముందుగా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి , ఆపదలో చిక్కుకున్న తెలుగువారికి మంచి నీళ్లు, ఆహారం అందేల చూడాలని ఆయన కోరినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకోని తెలుగుదేశం పార్టీ ఇప్పుడే నిద్రలేసి మాట్లాడుతుందని కాంగ్రెస్ నాయకులు కామెంట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles