Political mla shankar rao warning to congress party

mla shankar rao, p shankar rao, congress party, telangana issue, 2014 election, ys jagan party, cm kiran kumar reddy, telangana ministers, sonia gandhi, chalo assembly telangana,live updates,2013,chalo assembly,telangana chalo assembly,chalo assembly, breaking news, ap politics, political news, andhra news

mla shankar rao warning to congress party

శంకర్రావు శపథం ..? నాయకుల నవ్వులు

Posted: 06/17/2013 03:30 PM IST
Political mla shankar rao warning to congress party

మాజీ మంత్రి శంకర్రావు ఇటీవల కాలంలో విచిత్రమైన కామెంట్స్ చేస్తూ మీడియా వారికి, కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి శంకర్రావు చేసిన సహాయం పై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే శంకర్రావు ఒక శపథం చేశారు. 2014 లోపు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన ప్రకటిచారు. శంకర్రావు ప్రకటన పై కాంగ్రెస్ నాయకులు నవ్వుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో శంకర్రావుకు కాంగ్రెస్ సీటు ఇవ్వటమే కష్టం అయితే.. ఇలాంటి శపథం చేసి ఉన్న ఇమేజ్ ను డామేజ్ శంకర్రావు చేసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇవేమి పట్టించుకోని శంకర్రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ చేయాలన్న కోరిక ఉన్నప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికైనా తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు. తనతో పాటు చాలా మంది మంత్రులు కూడా పోటీ చేసే స్థితిలో లేరని చెప్పారు. అదేసమయంలో 15 రోజుల్లోగా తెలంగాణపై కేంద్రం నుంచి ఒక ప్రకటన వస్తుందని ఆయన అన్నారు. ఏది ఏమైనా తెలంగాణపై మంచి నిర్ణయం వెలువడుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవి వదులుకోని ఖాళీగా తీరుగుతున్న నాయకులను శంకర్రావు విమర్శలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles