Chalo assembly police should not use single bullet to cm kiran kumar reddy order

cm kiran kumar reddy order, chalo assembly, not use single bullet, trs party, telangana issue, bjp, tdp, political leaders, tjac leaders, ou students, police force, 144 section, hyderabad high tension, assembly, cp anurag sharma, dgp dinesh reddy, breaking news, ap politics, political news, andhra news

police should not use single bullet to cm kiran kumar reddy order

రబ్బరు బుల్లెట్ ను ప్రయోగించకండి? సీఎం

Posted: 06/13/2013 09:49 PM IST
Chalo assembly police should not use single bullet to cm kiran kumar reddy order

తెలంగాణ పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు జరగనున్న ‘ఛలో అసెంబ్లీ’, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చర్చలు జరిపారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఆందోళనకారులు అసెంబ్లీ వైపు సులువుగా చేరుకునేందుకు అవకాశమున్న తెలుగు తల్లి, ఖైరతాబాద్, నారాయణగూడ, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ బ్రిడ్జిలపై వాహనాల రాకపోకలను నిలిపేశారు. అసెంబ్లీ వైపు దారితీసే అన్ని మార్గాలను మూసివేసిన పోలీసులు వాహనాలను దారిమళ్లీస్తున్నారు. రాష్ట్ర రాజధానివైపు ఆందోళనకారులు రాకుండా ఎక్కడికక్కడే కట్టడి చేసేందుకు ప్రణాళిక రచించింది. పోలీసుల అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీసులు సంయమనం పాటించి, శాంతిభద్రతలను పరిరక్షించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన కారులపై రబ్బరు బుల్లెట్లను ప్రయోగించవద్దని తెలంగాణ జిల్లాల ఎస్.పీ.లకు సీఎం ఆదేశించారు. ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉండటంతో నింబంధనలు అతిక్రమించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఈ సమావేశంలో డీజీపీ దినేష్‌రెడ్డి, ఇంటిలిజెన్స్ చీఫ్, హైదరాబాద్, సైదాబాద్ సీపీలు అనురాగ్ శర్మ, సీవీ ఆనంద్‌లు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles