Political mla anam vivekananda reddy comments on ys jagan mohan reddy

anam vivekananda reddy, mla anam vivekananda reddy, congress party, nellure anam brothers, ys jagan, ysr, ysrcp, jagan-ysr, ys jagan pothuraju, anam comment on ys jagan, congress leaders, assembly, breaking news, ap politics, political news, andhra news

mla anam vivekananda reddy comments on ys jagan mohan reddy

వైఎస్ జగన్ ను పోతరాజు తో పోల్చిన ఎమ్మెల్యే?

Posted: 06/13/2013 04:26 PM IST
Political mla anam vivekananda reddy comments on ys jagan mohan reddy

నెల్లూరు ఆనం బ్రదర్స్ మీడియా బ్రదర్స్ మారిపోతున్నారు. అన్నదమ్ములు ఇద్దరు పోటీ పడి వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తూ .. మీడియా వార్తల్లోకి ఎక్కుతున్నారు. రాజకీయ ఓనామాలు నేర్చుకున్న గురువు గారి కుటుంబం పైనే ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఎమ్మెల్యే ఆనం పోతరాజుతో పోల్చారు. ఈ పోతరాజుకు ఇంకెంత మంది బలవ్వాలో అని వ్యాఖ్యానించారు. కాళ్లు, చేతలు పడిపోయి ఓ ఐఏఎస్ మూలనపడ్డారని, మేనత్తలాంటి సబిత, శిష్యుడి లాంటి మోపిదేవి, సహపాటి ధర్మాన బలయ్యారన్నారు. వైఎస్ కేబినేట్‌లో మంత్రి పదవి రాకపోవడంతో తాను బతికిపోయానని, లేదంటే జగన్ కన్నా ముందే జైల్లో ఉండేవాడినేమో అని ఆనం వివేకానందరెడ్డి అన్నారు. ఆనం చేసిన కామెంట్ వలన కాంగ్రెస్ నాయకులు కొంచెం చిన్నబుచ్చుకున్నారు. ఏమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు కాబట్టి , ఆనం విమర్శల్లు తగ్గించే బాగుంటుందని కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. కేవలం మీడియా ప్రచారం కోసమే ఇలాంటి విమర్శలు చేస్తే పార్టీకే దెబ్బ తగులుతుందని సీనియర్ నాయకులు అంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles