Chalo assembly rally will not be permitted cp anurag sharma

cp anurag sharma, chalo assembly rally, trs party, chalo assembly rally will not be permitted, city police commissioner anurag sharma, june 14th, breaking news, ap politics, political news, andhra news

Chalo Assembly rally will not be permitted: CP anurag sharma

చలో అసెంబ్లీకి అనుమతి లేదు

Posted: 06/12/2013 08:45 PM IST
Chalo assembly rally will not be permitted cp anurag sharma

చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి సాద్యం కాదని పోలీస్ కమిషన్ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతిచ్చే ప్రసక్తే లేదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో పలు ఉద్యమాలకు తాము అనుమతులివ్వడం జరగిందని కొన్ని ఉదహరించారు. ర్యాలి చేపడుతున్న రోజు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయించడం జరుగుతుందని, నగరానికి వచ్చే ప్రధాన రహదారుల వెంట పలు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో తాము అనుమతిచ్చినా హింస చెలరేగిందని 'మిలియన్ మార్చ్' ఘటనను ఉదహరించారు.

ఈ ఉద్యమంలో యువకులు, ఉద్యోగులు పాల్గొన కూడదని ఆయన సూచించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యం..తాజా పరిస్థితి దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి అనురాగ్ శర్మ ప్రకటించారు. 17 మంది ఎస్పీ స్థాయి అధికారులు, 30 మంది డిఎస్పీలు, 50 మంది ఇన్ స్పెక్టర్లు, 30 మంది సబ్ ఇన్ స్పెక్టర్లు, 800మంది హెడ్ కానిస్టేబుల్స్,  190 ఫ్టాటున్న సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని ఆయన తెలిపారుచట్టాని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన సూచించారు.ఎవరైనా అతిక్రమిస్తే తాము కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles