Political minister jana reddy press meet

minister jana Reddy, congress party, telangana congress mps, cm kiran kumareddy, home minister post, election, high commend, trs party, telangana issue

minister jana reddy press meet

నేను అలాంటి పని చెయ్యను జానా రెడ్డి?

Posted: 05/30/2013 06:20 PM IST
Political minister jana reddy press meet

పంచాయతీ శాఖ మంత్రి జానారెడ్డి హోంశాఖ పై కన్నువేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన ఈరోజు వాటిని ఖండించారు. నాకే చాలా సిగ్గుగా ఉంది. ఇలాంటి పుకార్లు ఎలా వస్తాయి. కాంగ్రెస్ గుడ్ బై చెబుతున్న తెలంగాణ ఎంపీ పై హైకమాండ్ జోక్యం చేసుకోని సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఎంపీలను, ఇతర నేతలను పిలిచే ఆలోచన హైకమాండ్ చేస్తోందని తెలిపారు. తాను కాంగ్రెస్‌ పార్టీని వీడేది లేదని జానారెడ్డి స్పష్టం చేశారు. తాను హోంమంత్రిత్వ శాఖ కోసం ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. మంత్రివర్గంలోని అన్ని శాఖలు మంచివే అన్నారు. తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో స్థానిక సంస్థల ఎన్నికల పైన మాత్రమే చర్చించానని, శాఖలపై చర్చించలేదన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోను కాంగ్రెసును వీడే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ విషయంలో అధిష్టానం పార్లమెంటు సభ్యులను, నేతలను పిలిచి మాట్లాడితే బాగుంటుందన్నారు. నేతలు పార్టీని వీడితే ఆ ప్రభావం తప్పకుండా ఉంటుందన్నారు. అది ఎన్నికలలో మాత్రమే తెలుస్తుందని చెప్పారు. మూడు రోజుల్లో బీసీ రిజర్వేషన్ల నివేదిక వస్తుందని, దాన్ని వారం రోజుల్లో ఈసీకి పంపిస్తామన్నారు. జూలై మొదటి వారంలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని జానారెడ్డి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles