Political tsr daggubati clash over vizag

tsr fires on daggubati venkatesh, daggubati settles scores with tsr, subbarami reddy fire on daggubati venkateswara rao, daggubati commets, congress party, dagguabati purandeswari, vizag,

tsr, daggubati clash over Vizag

దగ్గుబాటిని చీ కొట్టిన టిడిపి? టీఎస్సార్

Posted: 05/30/2013 02:03 PM IST
Political tsr daggubati clash over vizag

విశాఖలో ఎవరి బలం ఉంటే వారే పోటీ చేస్తారన్నారు. ఎదుటి వారిని గౌరవించడం తన సిద్ధాంతమన్నారు. విమర్శించక పోవడం రెండో సిద్ధాంతమన్నారు. దగ్గుబాటి తనను విమర్శించేందుకు ఓ పిచ్చివాడిలో వ్యవహరించారన్నారు. అసలు విశాఖ విషయంలో వెంకటేశ్వర రావుకు ఏం సంబంధమన్నారు. విశాఖ ఎంపి పురంధేశ్వరి అయితే ఆయన ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. ఆయన పిచ్చిమాటలు మాట్లాడారన్నారు. తాను దశాబ్దాలుగా అన్ని రంగాలలో ఎదిగానని అన్నారు. దగ్గుబాటికి విశాఖ దిక్కులు తెలుసా అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా విశాఖ ప్రజలకు సేవ చేస్తున్నానని కాబట్టే తాను ఆ సీటును కోరుతున్నానని చెప్పారు. సీటును కోరుకోవడంలో తప్పేంటన్నారు. తాను ఎప్పుడు కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, వెంకటేశ్వర రావును విమర్శించలేదన్నారు. విశాఖతో ఉన్న అనుబంధం వల్లే తాను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి విశాఖ టిక్కెట్‌ను కోరానని చెప్పారు. పలుమార్లు తాను దగ్గుబాటికి సహకారం చేశానన్నారు.

దగ్గుబాటి ఓ జంపింగ్ నేత అన్నారు. దగ్గుబాటి పనికిరాడని టిడిపి భావిస్తే ఆయన బిజెపిలోకి వెళ్లిపోయారని, అక్కడ వాళ్లు తట్టుకోలేకపోవడంతో కాంగ్రెసు పార్టీలోకి వచ్చారన్నారు. నాగార్జున సాగర్ డ్యాం వ్యవహారంలో తనపై ఆరోపణలు చేస్తున్న ఆయనకు ఏం తెలుసునని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాగార్జున సాగర్ సిమెంటు కేసుపై దగ్గుబాటి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆ కేసుతో తనకు సంబంధం లేదని కోర్టు కూడా తీర్పు ఇచ్చిందన్నారు. తనపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర రావు సంగతి తానే చూసుకుంటానని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి అన్నారు. దగ్గుబాటిపై తాను క్రిమినల్ కేసు పెడతానని, పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. తాను రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకే కాంగ్రెసు పార్టీలో చేరానని అన్నారు. తాను గెలిచినా గెలవకపోయినా విశాఖ ప్రజలకు సేవ చేశానన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles