Political cm kiran kumar reddy offered gifts in pileru

cm kiran kumar reddy, kiran kumar reddy constituency pileru in chittoor district, nallari kiran kumar reddy, congress party, tdp, trs party, ysrcp, tdp mahanadu,

cm kiran kumar reddy offered gifts in pileru

సమ్మర్ కాలం ..వరాలు?

Posted: 05/29/2013 11:07 AM IST
Political cm kiran kumar reddy offered gifts in pileru

తెలుగుదేశం పార్టీ రెండు రోజులు పాటు మహానాడు కార్యక్రమం నిర్వహించింది. టీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని రోజుల శిక్షణ క్లాసులతో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీక్ష పేరుతో నగరంలో హడావుడి చేసింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు చెయ్యలేదు. కానీ ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన సొంత జిల్లాలో రెండు రోజులు హాయిగా పర్యాటన సాగించారు. తన జిల్లా ప్రజలకు సమ్మర్ వరాలు ముఖ్యమంత్రి ప్రకటించారు. సొంత జిల్లాలో, స్వస్థలమైన పీలేరు నియోజకవర్గంలో ఆయన విసృ్తతంగా పర్యటించి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సొంత గడ్డ పీలేరుపై వరాల జల్లు కురిపించి తన మమకారాన్ని మరోసారి చాటుకున్నారు. పాలక పార్టీకి చెందిన నేతలంతా సీఎం పర్యటనలో పాల్గొని నిండుదనాన్ని కలిగించారు. కార్యకర్తలతో సీఎం మమేకమయ్యారు. పేరు పేరునా కార్యకర్తలతో మాట్లాడి కరచాలనం చేయడం వారిలో ఉత్తేజాన్ని నింపింది. అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టడంతో స్థానికుల నుంచి హర్షామోదం వ్యక్తమైంది. మొత్తం మీద సీఎం రెండు రోజుల పర్యటన ఆజిల్లా ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో మంచి ఉత్సాహాన్ని ముఖ్యంగా పార్టీ యంత్రాంగంలో సమరోత్సాహాన్ని నింపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles