Demand grows for bcci chief n srinivasan resignation

BCCI, BCCI chief, IPL, N Srinivasan, Spot-fixing, spot-fixing,N Srinivasan,Jyotiraditya Scindia,IPL spot-fixing,BCCI

After the arrest of his son-in-law for allegedly betting in the recently-concluded edition of the Indian Premier League (IPL), pressure is mounting on BCCI chief N Srinivasan to step down. Mr Srinivasan, who has denied having any knowledge of his son-in-law's alleged betting activities.

శ్రీనివాసన్ రాజీనామాకు డిమాండ్

Posted: 05/29/2013 08:54 AM IST
Demand grows for bcci chief n srinivasan resignation

భారత క్రికెట్ పెద్ద అయిన బీసీసీ క్రికెట్ ఛైర్మెన్ ఎన్. శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కింద అరెస్టు అయిన విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ చైర్మెన్ పదవి నుండి శ్రీనివాసన్‌ తప్పుకోవాలని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) ఫైనాన్స్‌ కమిటీ చైర్మన్‌, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా డిమాండ్‌ చేశారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇందర్‌ జిత్‌ సింగ్‌ బింద్రా తర్వాత సింధియా రాజీనామా డిమాండ్‌ చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ వ్యవహారంలో తాను ఎవరిని తప్పుపట్టడం లేదని..క్రికెట్‌ ను వివాదాలు చుట్టు ముట్టిన నేపథ్యంలో.. విచారణ సాఫీగా జరగడానికి శ్రీనివాసన్‌ తప్పుకోవాల్సిన అవసరం ఉందని సింధియా మీడియాకు వెల్లడించారు. సింధియా రాజీనామా డిమాండ్‌ను శ్రీనివాసన్ తోసిపుచ్చారు. అది అతని అభిప్రాయమని, అంతకు మించి తాను మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు. అల్లుడు గురునాథ్ అరెస్టు మామ పదవికే ఎసరు తెచ్చే విధంగా తయారైందని అంటున్నాయి క్రికెట్ వర్గాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles