Andhra telugu political news rahul gandhi on ap politics

rahul gandh, congress general secretory rahul gandhi, pcc botsa satyanarana, andrapradesh politics, aicc, congress party, congress mps,

rahul gandhi on ap politics

బొత్స సత్యనారాయణకు రాహుల్ లేఖ

Posted: 05/07/2013 08:48 AM IST
Andhra telugu political news rahul gandhi on ap politics

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు రాహుల్ లేఖ అందింది. ముఖ్యంగా ఎంపీల బలాలు, బలహీనతలపైనే ఈ భేటీలో చర్చ సాగుతుందని విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ సార్వత్రిక ఎన్నికల కసరత్తును ముమ్మరం చేశారు! ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర ఎంపీలతో తొలిసారిగా ఈనెల 9న భేటీ కానున్నారు. రాహుల్ దూతలు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చి పలువురితో సమావేశమయ్యారు. ఎంపీల బలాలు, బలహీనతలు, మళ్లీ టికెటిస్తే గెలుపోటములు తదితరాలపై సమాచారం సేకరించారు. అలాగే వైసీపీ ప్రాబల్యం, ఆ పార్టీతో లోపాయకారీగా అంటకాగుతున్న కాంగ్రెస్ ఎంపీల గురించి కూడా ఆరాతీశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆ ప్రాంతం నేతల అభిప్రాయాలనూ సేకరించారు. సీమాంధ్ర, తెలంగాణల్లో పార్టీ గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలపైనా ఆరాతీశారు. అనంతరం రాహుల్‌కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగానే రాహుల్ ఎంపీలతో మాట్లాడి, తనవద్ద ఉన్న సమాచారంతో బేరీజు వేసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల అంచనా. కాగా, ఎంపీలు సైతం తమ అభిప్రాయాలను గట్టిగా వినిపించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles