పశ్చిమబెంగాల్లో శారద కుంభకోణం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. ఇప్పటికే దీనివల్ల ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు కోల్పోగా, ఈ చిట్కంపెనీతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. హూగ్లీ జిల్లాలోని చుంచ్వారాకు సమీపంలో హలో ఇండియా చిట్ ఫండ్ కంపెనీ డైరెక్టర్ జయంత సర్కార్ (48) దారుణ హత్యకు గురయ్యాడు. డిపాజిట్ చేసిన వ్యక్తులే ఈ దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ భార్య పాపియా సర్కార్ వేర్వేరు ప్రాంతాలకు చెందిన అభిజిత్ సహా, అబ్దుల్లా రషీద్, బిప్ల్యాబ్ బిశ్వాస్ అనే ముగ్గురు వ్యక్తులే ఈ పనిచేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు బిధాన్ రాయ్ అనే శారద చిట్ ఫండ్ కంపెనీ ఏజెంట్ తండ్రి జగదీష్రాయ్(60) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉత్తర 24 పరగణా జిల్లాలో ఈ ఘటన జరిగింది. డిపాజిట్ దారులకు తన కుమారుడికి డబ్బులు చెల్లించే స్తోమత లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికిలోనై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ స్కాం వల్ల ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more