Political speaker nadendla manohar issues notices to 18 rebel mlas from cong tdp

speaker nadendla manohar, speaker nadendla manohar issues notices, 18 rebel mlas, congress, tdp, sonia gandhi, cm kiran kumar reddy, assembly speaker nadendla,

speaker nadendla manohar issues notices to 18 rebel mlas from congress, tdp

అసమ్మతి ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు

Posted: 05/07/2013 08:54 AM IST
Political speaker nadendla manohar issues notices to 18 rebel mlas from cong tdp

పార్టీ విప్‌ ధిక్కరించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటువేసిన సభ్యులపై తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు సభాపతికి ఫిర్యాదుచేశాయి. ఫిర్యాదును స్వీకరించిన సభాపతి ఇరు పార్టీల సభ్యులకు గతంలోనే నోటీసులు జారీచేశారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటువేసిన 18 మంది ఎమ్మెల్యేలకు సభాపతి నాదెండ్ల మనోహర్‌నోటీసులు జారీచేశారు. నోటీసులపై సభ్యులందరూ వివరణ ఇవ్వకపోవడంతో, సభాపతి మరోసారి నోటీసులు జారీచేస్తూ, వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 139మంది సభ్యులు, 149మంది సభ్యులు హాజరుకావాలని సభాపతి సూచించారు.

అయితే గతంలో సభాపతి జారీచేసిన నోటీసులకు 14మంది వివరణ ఇవ్వగా, మిగతా సభ్యులు స్పందించలేదు. సభ్యుల ఇచ్చిన వివరణలను ఇరు పార్టీలకు సభాపతి పంపించే అవకాశం ఉంది. వివరణలపై పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించిన తరువాత సభాపతి అసమ్మతి సభ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే సభ్యుల వివరణ, తదితర అంశాలను పరిధిలోకి తీసుకుంటే, జూన్‌ రెండో వారంలో అసమ్మతి సభ్యులపై వేటువేసే అవకాశం ఉందని పార్టీలు వెల్లడిస్తున్నాయి. వేటు వేసే సమయానికి సాధారణఎన్నికలకు కేవలం ఒక సంవత్సరం వ్యవధి ఉంటుంది. అయితే సాధారణ ఎన్నికలకు సంవత్సర వ్యవధి ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషన్‌ గతంలోనే స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని పార్టీలు వెల్లడిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles