Political nagam janardhan reddy meets rajnath singh

nagam janardhan reddy meets rajnath singh, nagam janardhan reddy meets rajnath singh at delhi, mla nagam janardhan reddy,

nagam janardhan reddy meets rajnath singh

బిజెపితో తెలంగాణ సాధ్యం-నాగం

Posted: 04/25/2013 01:53 PM IST
Political nagam janardhan reddy meets rajnath singh

మాజీ మంత్రి, సీనియర్ నేత డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది.పార్టీ రాష్ట్ర శాఖ అద్యక్షుడు జి.కిషన్ రెడ్డి తో కలిసి ఆయన డిల్లీ వెళ్లారు.బిజెపి అధ్యక్షుడు రాజ్ నాద్ సింగ్ ను ఆయన కలుస్తున్నారు.జనార్ధనరెడ్డి మహబూబ్ నగర్ నుంచి లోక్ సభకు పోటీచేసే అవకాశం ఉంది.బిజెపి తరపున ఈయన గట్టి అభ్యర్ధి అవుతారని భావిస్తున్నారు.1983 నుంచి రాజకీయాలలో ఉన్న నాగం ఐదు సార్లు టిడిపి తరపున శాసనసభకు ఎన్నిక కాగా ఒకసారి స్వతంత్ర సభ్యుడిగా ఎన్నికయ్యారు. తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించడానికి ఆయన టిడిపి నుంచి బయటకు వచ్చి తెలంగాన నగరా పేరుతో కొంతకాలం రాజకీయాలు నడిపారు.

కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అధ్వాన్నంగా ఉన్నాయని మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దనరెడ్డి అన్నారు .తెలంగాణ అంశంపై గట్టిగా కేంద్రీకరించాలని బిజెపి అదినేత రాజ్ నాద్ సింగ్ను కోరారన్నారు. ఎన్.డి.. అధికారంలోకి వస్తే చిటికెలో తెలంగాణ ఇస్తామని రాజ్ నాద్ సింగ్ ఇంతకుముందే చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఎన్.డి.. అదికారంలోకి వస్తేనే తెలంగాణ వస్తుందని అన్నారు. బిజెపితోనే తెలంగాణ సాద్యమని ఆయన అన్నారు.మీరు బిజెపిలో చేరుతున్నారా అని ప్రశ్నిస్తే, ఇంకా సమయం ఉందని,తాను తన నియోజకవర్గ ప్రజలతో , తెలంగాణలో ఉన్న తన అభిమానులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని నాగం అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles