Major fire accident at axis bank coimbatore

major fire accident at axis bank coimbatore, major fire broke at axis bank, tamilnadu, axis bank

major fire accident at axis bank coimbatore

యాక్సిస్ బ్యాంక్ లో ఘోర అగ్నిప్రమాదం

Posted: 04/25/2013 01:48 PM IST
Major fire accident at axis bank coimbatore

 

హైదరబాద్ నడిబొడ్డున ఉన్న అబిడ్స్ లో రగిలిన అగ్ని ప్రమాదం మంటలు ఇంక రగులుతునే ఉన్నాయి. వేసవి కాలం అగ్ని ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతాయాని తెలుసు. కానీ మరీ ఇంత ఘోరంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న తిరుపతిలో జరిగిన అగ్ని ప్రమాదం తెలిసిందే. ఇప్పుడు తమిళనాడు కోయంబత్తూరులోని యాక్సిస్ బ్యాంక్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా ఉద్యోగులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈరోజు ఉదయం 10 గంటలకు భవనంలోని మూడో అంతస్తులు మంటలు చెలరేగినట్లు సమాచారం. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. చాలా ఇరుగ్గా వున్న భవనంలో ఒకే మార్గం వుండటం వల్ల ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా వుందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడంతస్తుల భవనంలో ఏకంగా 18 బ్యాంక్‌లు వున్నాయని, మంటలకు భయపడి పైనుంచి కిందికి దూకిన ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles