Political ttd ex chairman adikesavulu naidu died in hospital

ttd ex-chairman adikesavulu naidu died in hospital, adikesavulu naidu died,adikesavulu naidu dead adikesavulu naidu news, adikesavulu naidu, adikesavulu naidu passed away, d k adikesavulu naidu

former lok sabha mp adikesavulu naidu dead

ఆదికేశవులు నాయుడు కన్నుమూత

Posted: 04/25/2013 10:17 AM IST
Political ttd ex chairman adikesavulu naidu died in hospital

టిటిడి మాజీ చైర్మన్, ప్రముఖ వ్యాపార వేత్త డి.కె. ఆదికేశవులు నాయుడు కన్నుమూశారు. బెంగుళూరులోని వైదేహి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. చిత్తూరు స్వస్థలం. భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు డి.. శ్రీనివాస్ 2009 ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీచేశారు. ఆదికేశవులు గతంలో ఒక పర్యాయం టిడిపి తరఫున చిత్తూరు లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

రెండు మార్లు టిటిడి చైర్మన్ పదవిని నిర్వహించారు. పి.వి నర్సింహ్మారావు, చంద్రబాబు నాయుడు, వైఎస్సార్, చిరంజీవి వంటి ప్రముఖులతో ఆదికేశవ సన్నిహిత సంబందాలు నడిపారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గతంలో ఒకసారి ఆయనకు బైపాస్ సర్జరీ జరుగగా అది విఫలం కావడంతో ఇటీవల ఆయనను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ పరమపదించారు. సీఎం సంతాపం డికె ఆదికేశవులు మృతిపట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. స్వస్థలమైన చిత్తూరు జిల్లా వాసితో తనకున్న పరిచయాలను, అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles