Andhra telugu political news gali muddu krishnama naidu fire on ys jagan

gali muddu krishnama naidu fire on ys jagan, tdp leader, ysrcp, jagan-ysr, gali muddu krishnama naidu, by election,

gali muddu krishnama naidu fire on ys jagan

జగన్‌ శక్తిమంతుడా ?

Posted: 04/25/2013 10:25 AM IST
Andhra telugu political news gali muddu krishnama naidu fire on ys jagan

అవినీతిపరుడు, దోపిడీదారైన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని దేశంలోనే అత్యంత శక్తిమంతమైన వారిలో ఒకరిగా కొన్ని పత్రికలు సర్వేల్లో ఆకాశానికి ఎత్తడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుపట్టింది. ఒక వార పత్రిక రాష్ట్రంలో ఏకంగా ప్రథమ స్థానం కట్టబెట్టడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆ సర్వేలకు విశ్వసనీయత లేదన్నారు. అత్యంత శక్తిమంతమైన 100 మంది జాబితాలో ఒక ఆంగ్ల దిన పత్రిక జగన్‌కు 36వ స్థానం కట్టబెట్టింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో గెలుపు ఒక్కటే విశ్వసనీయతకు ప్రామాణికం కాదని గాలి అన్నారు.

గత ఉప ఎన్నికల్లో 18 సీట్లకు రాజీనామా చేసి 15సీట్లను వైకాపా గెల్చుకోవడం పెద్ద విశేషమేమీ కాదని కొట్టిపారేశారు. అకాల వర్షాలతో నష్టబోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ముద్దు డిమాండ్‌ చేశారు. ఇటీవల జలమండలి కార్మిక సంఘ ఎన్నికల్లో తెలుగుదేశం మద్దతు పలికిన అభ్యర్థి ఓటమిపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, కార్మిక సంఘాల ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికలకు ప్రమాణం కాదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీల బిల్లులను విపరీతంగా పెంచి పేద ప్రజల నడ్డిని విరిచేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు ఇంధన సర్దుబాటు వ్యయం పేరుతో ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. ప్రభుత్వం విద్యుత్‌ చార్జీల విషయంలో మోసపూరితంగా వ్యవహరిస్తోందని, అందుకే విద్యుత్‌ చార్జీల బిల్లులు చెల్లించకుండా కిరణ్‌కుమార్‌ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేపట్టాలని పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles