Traveller shot at by constable for seat

traveller shot at, yashwantapur express, constable shoots traveller, nandyala, kurnool, panyam, prakasam district

traveller shot at by constable for seat

సీటు కోసం హింసకు దిగిన ఘటన

Posted: 04/24/2013 08:40 AM IST
Traveller shot at by constable for seat

సీటుకోసం అంటే, అతనేమీ రాజకీయ నాయకుడు కాదు.  రైలులో కూర్చోనివ్వలేదని కానిస్టేబుల్ కి వచ్చిన కోపం అతన్ని ఆ క్షణంలో విచక్షణను కోల్పోయి సీటు ఇవ్వటానికి నిరాకరించిన ప్రయాణీకుడిని గన్ తో కాల్చిన సంఘటన నిన్న రాత్రి యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో జరిగింది. 

ప్రకాశం జిల్లా బొల్లపల్లెకు చెందిన సింగారావు కర్నాటక నుండి తన స్వగ్రామం వెళ్ళటానికి యశ్వంత పూర్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం చేస్తుండగా రైలు నంద్యాల సమీపంలోకి వచ్చేటప్పటికి కర్నూల్ కి చెందిన కాన్ స్టేబుల్ రామచంద్రగౌడ్ పాణ్యం స్టేషన్లో రెలు ఎక్కాడు.  పడుకునివున్న సింగారావుని లేచి తనకి సీటిమ్మని అడగ్గా అతను నిరాకరించటంతో  ఆగ్రహించిన రామచంద్రగౌడ్ అతన్ని తన తుపాకీతో కాల్చాడు. 

తీవ్రమైన గాయలతో రక్తస్రావం అవుతుండటం వలన సింగారావుని ముందు నంద్యాల హాస్పిటల్ కి తరలించి అక్కడినుంచి కర్నూల్ హాస్పిటల్ లో ఇంకా మెరుగైన వైద్య చికిత్స కోసం తీసుకెళ్ళారు.  సింగారావు కర్నాటకలో కొప్పల సమీపంలో వ్యవసాయ భూమిని కౌలుకి తీసుకుని చేసుకుంటున్నాడు. 

కాల్పులు జరిపిన వెంటనే విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు రామచంద్రగౌడ్ ని అదుపులోకి తీసుకుని అతని సర్వీస్ గన్ ని స్వాధీనం చేసుకున్నారు. 

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles