Political chandra babu retorts kcr calling him kumbhakarna

chandrababu calls kcr kumbhakarna, kcr sleeping in farm house, chandra babu naidu, k chandra sekhara rao, telugu desam party, telangana rashtra samithi

chandra babu retorts kcr calling him kumbhakarna

ఫాంహౌస్ లో కుంభకర్ణుడు

Posted: 04/23/2013 04:00 PM IST
Political chandra babu retorts kcr calling him kumbhakarna

ఆరునెలలు ఫామ్ హౌస్ లో కుంభకర్ణుడిలా నిద్రపోయి లేస్తూనే తెదేపా మీద విరుచుకుపడ్డారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కెసిఆర్ మాటలను విమర్శించారు.  

విశాఖ జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు, కెసిఆర్ కి సూట్ కేసులు అందలేదు కాబట్టే బయ్యారం విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.  ఇంతవరకూ తాను తెరాస ను విమర్శలకు గురిచెయ్యలేదని, సీదాసాదాగా మాట్లాడుతున్న తన పార్టీ మీద అనవసరమైన విమర్శలను గుప్పిస్తుండటం వలనే తనీ విధంగా మాట్లాడాల్సి వస్తోందని అన్న చంద్రబాబు, వైయస్ ఆర్ తన అల్లుడు అనిల్ కి లక్షానలభైవేల ఎకరాలను కట్టబెట్టినప్పుడు కెసిఆర్ ఏం మాట్లాడలేదు ఎందుకంటే అప్పడు ఆయనకు సూట్ కేసులు ముట్టాయి.  ఇప్పుడవి ముట్టలేదు కాబట్టి బయ్యారం గనుల మీద రాద్ధాంతం మొదలైందన్నారు.   కెసిఆర్ కి ఎంతసేపూ అవినీతి రాజకీయాలు సూట్ కేసులు అందుకోవటాలు మాత్రమే కానీ ప్రజాప్రయోజనాలు పట్టవు అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

గమ్మత్తేమిటంటే బయ్యారంలోనే స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగాలని ఈ వ్యవహారం ఊపందుకున్న దగ్గర్నుంచీ అంటూనేవుంది.  అయినా కెసిఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిపి, బొత్సా వ్యాఖ్యలను కూడా ఉటంకిస్తూ చంద్రబాబు నాయుడిని విమర్శించటం పై చంద్రబాబు నాయుడు మండిపడుతున్నారు.  

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles