Botsa satyanarayana comment on steelplant

botsa satyanarayana comment on steelplant, congress chief botsa satyanarayana, pcc botsa, telangana mines, steel plant, bayyaram mines, vishakhapattanam steel plant congress leaders, trs leaders demand,

botsa satyanarayana comment on steelplant

స్టీల్ప్లాంట్ పెట్టాలనటంలో తప్పులేదు

Posted: 04/22/2013 04:56 PM IST
Botsa satyanarayana comment on steelplant

గతంలో తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పులేదన్న రాజకీయ నాయకుడు ఇప్పుడు అదే బాటలో.. మరో వివాదానికి ఆజ్యం పోసాడు. బయ్యారం గనుల విషయంలో మూడు ప్రాంతాల నాయకులు మాటలతో ఇనుమును తవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, టిడిపి నాయకులు బయ్యారం గనుల భగోవతం లో నటిస్తున్నారు. ఇలాంటి సమయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ గాంధీ భవన్ లో కొత్త వివాదం తెరపైకి తెచ్చారు. బయ్యారంలో స్టీల్ ఫ్లాంట్ పెట్టాలని డిమాండ్ చేయటంలో ఎలాంటి తప్పులేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గాంధీభవన్ లో విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని కోరుకోవటంలో ఎలాంటి తప్పులేదని.... అయితే సాంకేతికంగా సౌలభ్యత లేదని బొత్స అన్నారు. తెలంగాణ అంశం సున్నితమైనదని, దానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. బొత్స పై సీమాంద్ర నాయకులు , ముఖ్యమంత్రి వర్గీయులు మండిపడుతున్నారు. గతంలో నిర్బయా రేప్ విషయంలో బొత్స క్షమాణాలు చెప్పిన విషయం తెలిసిందే. అంటే తొందరపడి మాట్లాడటం ఆయనకు అలవాటేనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles