Kcr angry on botsa satyanarayana

kcr angry on botsa satyanarayana, Botsa Satyanarayana, chief minster kiran kumar reddy, congress party, tdp, chandra babu naidu, bayyaram mines, trs leader kcr,

kcr angry on botsa satyanarayana

కిరణ్ , బొత్స , బాబు తలతిక్క మాటలు మానుకోండి?

Posted: 04/22/2013 07:52 PM IST
Kcr angry on botsa satyanarayana

టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాంగ్రెస్ పార్టీ , టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. బయ్యారం పై నడుస్తున్న భగోవతం పై కేసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు కేసిఆర్ మండిపోతున్నారు. ఈ ముగ్గురు ముందు తలతిక్క మాటలు మానుకోండి అంటూ పిలుపునిచ్చారు. బయ్యారం గనుల గురించి మాకు తెలుసు, మీరు నోరు మూసుకోండని , సీఎం కిరణ్ , బొత్స , చంద్రబాబును టార్గెట్ చేసి కేసిఆర్ రెచ్చిపోయారు. బయ్యారంపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తలతిక్క మాటలు మానుకోవాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ మండిపడ్డారు. బొత్స తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. బయ్యారంపై విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని ఆయన అన్నారు. బయ్యారం గనులపై మే నెలలో మహా ఉద్యమాన్ని నిర్వహిస్తామన్నారు. బయ్యారం గనుల్లో నాణ్యత లేదని బొత్స అసత్య ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనన్న సీఎం కిరణ్‌ పార్టీకి ఒక్క ఓటు వేయొద్దని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబుకు ఒక్క సీటు రాకుండా చేయాలని ప్రజలకు కేసీఆర్‌ సూచించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles