Cpi mla chandravathi angry on minister ramreddy venkata reddy

cpi mla chandravathi angry on minister ramreddy venkata reddy, cpi mla chandravathi, minister ramreddy venkata reddy, chandravathi fire on minister, congress party,

cpi mla chandravathi angry on minister ramreddy venkata reddy

ఎమ్మెల్యే చంద్రావతి ఆగ్రహం భయపడిన మంత్రి ?

Posted: 04/22/2013 01:40 PM IST
Cpi mla chandravathi angry on minister ramreddy venkata reddy

ఇటీవల వరుస ఆరోపణలను ఎదుర్కోంటున్న మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డిపై ఒక మహిళ ఎమ్మెల్యే మండిపడింది. మంత్రి ప్రవర్తిస్తున్న తీరు పై ఆమెలో ఆగ్రహం తెప్పించింది. మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డిపై సీపీఐ ఎమ్మెల్యే చంద్రావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎమ్మెల్యేల హక్కులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. వైరా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సహకరించడంలేదని ఆరోపించారు. మంత్రి వేధింపులపై శాసన సభాపతికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. మంత్రిపై ప్రివిలేజ్ నోటీసు ఇస్తానని చెప్పారు. ఎమ్మెల్యేల గౌరవానికి భంగం కలగకుండా శాసన సభాపతి నిబంధనలు తెలియజేయాలన్నారు. ఇంకా దొర అని పిలిపించుకుంటున్నారే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడంలేదన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని మంత్రి గ్రహించాలని సలహా ఇచ్చారు. జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలను కూడా మంత్రి మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. అధికారులను బెదిరిస్తూ తన నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles