Govt decision to hand over bayyaram mines to vizag steel plant opposed

bayyaram mines to vizag steel, cpi opposes bayyaram mines decision, trs opposes bayyaram mines decision, singareni collieries, telangana jagruti kavita, etela rajender trs, ponnam prabhakar congress mp

govt decision to hand over bayyaram mines to vizag steel plant opposed

తెలంగాణాను దోచి ఆంధ్రాకు కట్టబెట్టే కుట్ర!

Posted: 04/19/2013 12:16 PM IST
Govt decision to hand over bayyaram mines to vizag steel plant opposed

 

 

ఖమ్మం జిల్లాలో బయ్యారం ఇనుప ఖనిజాల గనులను విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ కి అప్పగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ సిపిఐ, తెరాసలు ఆందోళనలు చేపట్టాయి.

 

స్టీల్ ప్లాంట్ వినియోగానికి బయ్యారం గనులలోని ఖనిజాన్ని వాడుకునే వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వం ఆలోచన కానీ, దాని బదులు ఇక్కడే స్టీల్ ప్లాంట్ ని స్థాపించవచ్చు కదా అంటారు సిపిఐ నాయకుడు నారాయణ. దాని గురించి ఆలోచన చెయ్యమని ఆయన ముఖ్యమంత్రి కి లేఖకూడా రాసారు. అలా చెయ్యటం వలన ఖమ్మం వరంగల్ జిల్లాలో లభించే బొగ్గు ఉపయోగపడుతుంది, స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని నారాయణ సూచించారు.

 

తెలంగాణా రాష్ట్ర సమితి శాసన సభ ఫ్లోర్ లీడర్ ఈటెల రాజేందర్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఇది తెలంగాణా సంపదను దోచి ఆంధ్రాకి ఇవ్వటానికి చేస్తున్న కుట్రని విమర్శించారు.

 

తెలంగాణా జాగృతి సంస్థాపకురాలు కవిత మాట్లాడుతూ, ఆంధ్రోళ్ళ అహంకారానికి ఇది నిదర్శనమని అన్నారు. బయ్యారం గనులు సింగరేణి కాలరీస్ కి అప్పజెప్పమని ఆమె డిమాండ్ చేసారు. నీరు బొగ్గు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ స్థాపనకు అనువైన స్థలం కదా అని అనగా, అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్, ఈ విషయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నానని అన్నారు.

 

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles