Dead prisoner released on bail

prisoner death in warangal central jai, somla naik dead in jail, central excise police, illicit liquor, dead released on bail

dead prisoner released on bail

పోలీసు ఆధీనంలో నిందితుని ప్రాణాలు పోయిన వైనం

Posted: 04/19/2013 11:13 AM IST
Dead prisoner released on bail

హన్మకొండ మండలంలోని గుండ్ల సింగారం గ్రామవాసి సోమ్లా నాయక్ ని ఏప్రెల్ 16 న దొంగతనంగా తయారు చేసిన మద్యాన్ని విక్రయిస్తున్న నేరం మీద సెంట్రల్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసారు. అతన్నకి బుధవారం బెయిల్ లభించింది.

ఉదయం 9.30 కి అతన్ని విడుదల చేసామని జైలు అధికారులు చెప్తున్నారు. కానీ 11.30 కి సోమ్లానాయక్ మృతదేహాన్ని ఆటోలో తీసుకుని జైలుకి వచ్చిన అతని కుటుంబీకులు పోలీసులు అతన్ని కొట్టి చంపారని ఆరోపించారు.

జైలు అధికారులు చెప్పినదాన్నిబట్టి అతను జైలుకి వచ్చేటప్పటికే అనారోగ్యంతో బాధపడుతుంటే అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళటం జరిగింది. కానీ అతని కుటుంబీకులు మాత్రం అదంతా అబద్ధమని చెప్తూ న్యాయం కోసం వరంగల్ సెంట్రల్ జైలు ముందు ఆందోళన చెయ్యటం మొదలు పెట్టారు. అక్కడికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూస్తామని హామీ ఇవ్వటంతో సద్దుమణిగింది.

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles