Police apathy for injustice to common man

5 year girl raped in delhi, raped girl critical, dlehi gandhinagar, delhi chief minister, sheila dixit, aam admi party

police apathy for injustice to common man

సామాన్యుడి పట్ల పోలీసుల నిర్లక్ష ధోరణి, అమానుషత్వం

Posted: 04/19/2013 03:42 PM IST
Police apathy for injustice to common man

 ఢిల్లీలో పొరుగింటి మనిషి నిర్బంధంలో రెండు రోజులు పలుమార్లు అత్యాచారానికి గురైన ఐదు సంవత్సరాల బాలిక పరిస్థితి విషమంగా ఉంది. మృత్యువుతో పోరాడుతోంది ఆ చిన్నారి. ఏప్రెల్ 15 న నిర్భందంలో ఉంచిన 30 సంవత్సరాల వ్యక్తి తూర్పు ఢిల్లీ గాంధీనగర్ లో ఒక భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో నివసిస్తుంటాడు. బాధితురాలి కుటుంబం కూడా గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటారు. 17 వ తేదీన సాయంత్రం అమ్మాయి పెట్టిన కేకలు విని కుటుంబ సభ్యులు అమ్మాయిని చెరనుంచి విడిపించారు.

ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. కానీ తూర్పు ఢిల్లీ కి చెందిన ఆ అమ్మాయి తండ్రి కథనం వేరేలా ఉంది.

ముందసలు ఫిర్యాదు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యటానికి కూడా నిరాకరించారు. ఆ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టటానికి ప్రయత్నాలు చెయ్యలేదు సరికదా మమ్మల్ని బయటకు పంపించేసారు. చివరకు బుధవారం దొరికిన అమ్మాయిని షాదరా లోని స్వామి దయానంద హాస్పిటల్ లో చికిత్సకు చేర్చారు. అప్పుడు మాత్రం వచ్చి, రెండు వేల రూపాయలు చేతిలో పెట్టి, ఖర్చులకి ఉంచుకోమని చెప్తూ, ఈ విషయాన్ని పెద్దగా చెయ్యద్దని, మీడియాలోకి తీసుకెళ్ళద్దని హెచ్చరించి, అమ్మాయి ప్రాణాలతో ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెల్పుకోమని సలహా కూడా ఇచ్చిపోయారు. అమ్మాయిని ఇంటికి తీసుకుపోయి కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించమని సూచించారంటూ తండ్రి, బంధువులు ఆరోపించారు.

ఆ అమ్మాయి ఆడుకోవటానికి బయటకు పోయినప్పుడు దుండగుడు ఎత్తుకెళ్ళి వాళ్ళ ఇంట్లో గదిలో పెట్టి తాళం వేసాడు. మాకు న్యాయం జరగాలని కోరుతున్నామంటూ అమ్మాయి తల్లి రోదిస్తోంది.

ఈ ఘటనకు ఆగ్రహించిన స్థానికులు ఆందోళన చేయటం ప్రారంభించారు. నిందితుడి కోసం వెతుకుతున్నామని పోలీసులు చెప్తున్నా ఆవేశంతో ఈ ఘటన మీద నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించి, సామాన్య ప్రజానీకం పట్ల అధికారుల వైఖరి ఎంత అమానుషంగా ఉందో ఈ సంఘటన తెలియజేస్తోందని అన్నారు. కేసు బయటకు రాకుండా ఉండటానికి తల్లిదండ్రులకు లంచం ఎరచూపిన పోలీసుల ప్రవర్తన అతి దారుణమని, చిన్నారిని వెంటనే ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కి తరలించినట్లయితే ప్రాణాలు నిలిచే అవకాశం ఎక్కువుంటుందని వాళ్ళు అన్నారు.

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles