Youth attack media person outside hyderabad rain pub

rain pub, hyderabad, banjara hills, media person attacked, youth under alcohol influence, youth with short dress, foul language

youth attack media person outside hyderabad rain pub

రెయిన్ పబ్ బయట యువత హంగామా

Posted: 04/12/2013 09:30 AM IST
Youth attack media person outside hyderabad rain pub

నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కురచ డ్రస్ లు వేసుకున్న వనితలు కొందరు యువకులు హైద్రాబాద్ బంజారా హిల్స్ లోని రెయిన్ పబ్ లో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద హంగామా చేసారు.  మద్యం ప్రభావం కొట్టొచ్చినట్టుగా కనపడుతున్న వాళ్ళంతా రోడ్డు మీద వెళ్తున్న వారిని అల్లరి చేస్తూ రోడ్డు మీద చిందులు వేస్తుండటం తెలిసిన మీడియా ప్రతినిధులు కెమేరాలతో వెళ్ళి చిత్రీకరిస్తుండగా వాళ్ళు దాడికి పాల్పడ్డారు.  అడవాళ్ళు కూడా దుర్భాషలాడుతూ నోటికి వచ్చినట్లుగా తిడుతూ మీడియా మీద కలియబడి కేమెరా లాక్కున్నారు. 

ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు పోలీసులకు తెలియజేయటంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

మీకేం హక్కుందని వీడియో తీస్తున్నారు, రేప్పొద్దున చెప్తా చూడు నీ సంగతి అంటూ వీడియో తీసినా ఆడియోని కట్ చెయ్యవలసిన అగత్యం ఏర్పడే పదజాలంతో తిడుతూ, వంటిమీద చాలీచాలని దుస్తులను వీడియోలో స్పష్టంగా చూపించకుండా మాస్క్ చెయ్యవలసిన అవసరాన్ని కలిగించిన ఆ వనితలు యువకులు వారిస్తున్నా కేమెరా మన్ లు, మీడియా వారి మీద దాడికి తలపడ్డారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles