World telugu meet in malasia

world telugu meet, malasia, dasari narayana rao, raghavendrarao, keeravani, sai kumar, ali, hema, justice chalameswar

world telugu meet in malasia

మలేషియాలో ప్రపంచ తెలుగు మహాసభలు

Posted: 04/11/2013 05:51 PM IST
World telugu meet in malasia

రేపు సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు మలేషియాలో నిర్వహిస్తున్న ప్రపంచ మహాసభలలో ఇది 10 వ మహాసభ.  రెండు సంవత్సరాలకోసారి నిర్వహించే తెలుగు మహాసభలలో ఈసారి మలేషియా ప్రధానమంత్రి అబ్దుల్ రజాక్ ముఖ్య అతిథి. తమిళనాడు గవర్నర్ రోశయ్య, భారత రాయబారి విజయ్ గోఖలేల ప్రసంగాలుంటాయి.  సినీ ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు, డా.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, డా.వి.లక్ష్మణ్ దత్ లను సన్మానిస్తారు.

స్థానిక ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో ఈ సభలకు హాజరవుతున్నారు.  తరువాతి రోజు అంటే 13న నిర్వహించే వ్యాపార సమావేశంలో రాష్ట్రం నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొంటారు. 

14 న అంటే ఆఖరి రోజున నిర్వహించే సభలకు కేంద్రమంత్రి బలరామ్ నాయక్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథులుగా వ్యవహరిస్తారు.  ఈ ముగింపు ఉత్సవంలో సినీ ప్రముఖులకు, కళాకారులకు సన్మానం చేస్తారు.  అందులో కె.రాఘవేంద్రరావు, కీరవాణి, ఎమ్ఎమ్ శ్రీలేఖ, వందేమాతరం శ్రీనివాస్, సాయికుమార్, అలీ, హేమలు ఉంటారు. 

ఈ సమావేశాలలోని వేడుకలలో సినీ, ఇతర కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి.  దానితో పాటు తెలుగు భాషా ప్రచారం, ప్రవాసాంధ్రుల స్తితిగతులలాంటి అంశాలమీద చర్చలు కూడా ఉంటాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles