Relay fast protesting dubbed tv serials

tv serials, tv artists, kota srinivasa rao, dasari narayana rao, cpi narayana, vijay yadav, e tv, dubbed tv serials

relay fast protesting dubbed tv serials

నిరవధిక దీక్షగా మారిన టివి కళాకారుల రిలే దీక్ష

Posted: 04/11/2013 05:16 PM IST
Relay fast protesting dubbed tv serials

డబ్బింగ్ సీరియల్స్ ని నిలిపివేయాలని కోరుతూ టివి కళాకారులు ఇందిరాపార్క్ దగ్గర చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఈరోజు పదకొండోరోజుకి చేరుకుంది.  ఈరోజు దీక్షలో టివి కళాకారుడు విజయయాదవ్ పాల్గొని, దాన్ని నిరవధిక దీక్షగా మార్పు చేసారు. 

వీరి ఆందోళనకు మద్దతు తెల్పుతూ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు, దర్శకుడు దాసరి నారాయణరావు, సిపఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కళాకారుల పొట్టల కొడుతూ డబ్బింగ్ సీరియల్స్ ని ప్రసారం చేస్తున్న తెలుగు టివి ఛానెల్స్ యాజమాన్యం మీద ఆగ్రహాన్ని వ్యక్తంచేసారు.  ఎంతో కాలంగా డబ్బింగ్ సీరియల్స్ ప్రసారాలను చేపట్టవద్దని చెప్తున్నా వినకుండా అలాగే కొనసాగిస్తూ స్థానిక కళాకారులకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

 

ఈ టివి, జెమిని టివి యాజమాన్యాలు మాత్రమే టివి కళాకారుల వ్యధను గుర్తించి డబ్బింగ్ సీరియల్స్ ని ఇక ప్రసారం చెయ్యమని ప్రకటించటం పట్ల సినీ ప్రముఖులు, టివి కళాకారులు హర్షాన్ని వ్యక్తపరచారు.  మిగిలిన ఛానెల్స్ కూడా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోనట్లయితే ఉద్యమం ఇంకా తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు ఉద్యమంలో పాల్గొన్న కళాకారులు.  జి తెలుగు కూడా కాస్త మెత్తబడ్డట్టుగా కనిపించినా రాతరూపంలో హామీ ఇవ్వలేదని వాళ్ళు తెలియజేసారు.

 

మా టివి, జి తెలుగు కార్యాలయాల ముందు ధర్నా చేసిన కళాకారులు అలా ప్రతిరోజూ చేస్తామని అన్నారు.  62 డబ్బింగ్ సీరియల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయని, వాటి వలన స్థానిక కళాకారుల ప్రతిభ మట్టిగొట్టుకుపోతోందని టివి కళాకారులు వాపోయారు. 

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles