Cattle stealingpng

cattle-lifters.png

Posted: 04/04/2013 10:00 AM IST
Cattle stealingpng

goat-theft

ఉత్తర గోగ్రహణమని భారతంలో విరాటపర్వంలో ఉంటుంది. అఙాత వాసం చేస్తున్న విరాటరాజు రాజ్యం నుంచి కౌరవులు ఆవులను బలవంతంగా తోలుకెళ్తుంటారు. గోదానం చెయ్యటం, గోవులను సంపదలుగా చూసుకోవటంలాంటి ఆచారాలు ఉండటం వలన ఆ కాలంలో వాటి దొంగతనాలు జరుగుతుండేవి కానీ పెద్ద సామ్రాజ్యాన్ని పాలించే చక్రవర్తి, భీష్మ ద్రోణాది మహా యోధలు ఆవులను దొంగిలిచటానికి రథాలు, సైనికుల సమేతంగా తరలి రావటం చిన్నప్పుడు మాకు హాస్పాస్పదంగా అనిపించేది. అయితే ఆ పనిలో పాండవులను బయటకు రప్పించటమనే లక్ష్యం ఉందనుకోండి.

కానీ పెరుగుతున్న ధరలలో జంతువుల ధరలు ముఖ్యంగా ఆహారంగా ఉపయోగించే జంతువుల ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో హైద్రాబాద్ నగర శివార్లలో జంతువుల దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఇన్నోవా కారులో వచ్చి గొర్రెలను ఎత్తుకుపోదామని ప్రయత్నం చేసిన దుండగలు, స్థానికులు అడ్డం తిరగటంతో అదాటుగా కొందరు పారిపోవటం, కారుని అడ్డగించిన వారిమీదకు ఎక్కించటం చేసారు.

నగర శివార్లలోనే కాదు నగరంలోకూడా గుడెసెల్లో నివసిస్తూ జీవితాన్ని వెళ్ళదీసుకునేవారు, అదనపు ఆదాయంగా ఉంటుందని కోళ్ళు, గొర్రెలను పెంచుతుంటారు. అవి స్వేచ్చగా అటు ఇటు తిరిగి సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వచ్చేస్తాయి. అయితే కాస్త ఏపుగా పెరగగానే వాటిని కాపాడుకోవటానికి నానా తంటాలు పడవలసివస్తోందంటున్నారు పాత బస్తీలోని స్థానికులు. ఆటోల్లో వచ్చి గబుక్కున ఆ జంతువులను అందుకుని రయ్యి మని వెళ్ళిపోతున్నారు దోపిడీ దొంగలు. చాంద్రాయణ గుట్టలో అలా ఆటోలో తీసుకెళ్తున్న దుండగుల అడ్డగించిన మనిషి మీదకు కూడా ఎక్కించి ఆటోని తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది. జహంగీర్ అనే వ్యక్తి ఈ సంవత్సరంలోనే మూడు గొర్రెలను పోగొట్టుకున్నాని, 15000 రూపాయల వరకూ నష్టపోయానని తన వేదనను వ్యక్తపరచాడు. ఇలాంటి కేసులెన్నో.

3000 వేల నుంచి 8000 వేల వరకూ ఒక్కో గొర్రె ఖరీదు చేసే జంతువులను పోగొట్టుకున్నవారు లబోదిబో మని పోలీసులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం ఉండటం లేదు. పోలీసులు ఈ కేసులను పట్టించుకోవటం లేదని బాధితులు వాపోతున్నారు. ఎక్కడైనా స్థానికులకు దొరికితే మాత్రం పోలీసులకు అప్పగించేముందు వాళ్ళకి దేహశుద్ధిని బాగా చేసి మిగతా పని మీరు చూసుకోండని అంటున్నారు. అపహరణకు గురైన జంతువులు అటువంటి సరుకుని సగం రేటుకి కొనే కొన్ని కబేళాలకు తరలిపోతుంటాయి. వివిధ పనుల్లో వ్యస్తులైవున్న పోలీసుల దృష్టిలో ఇవి చాలా చిన్న కేసులే కానీ, పెద్దగా పెట్టుబడి పెట్టకపోయినా, వాటిమీదనే ఆశలు పెట్టుకున్న పేదవాళ్ళకి అది పెద్ద నష్టమే.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Electricity problem to be discussed by govt today
Arrangement for ugadi at tirupati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles