Arrangement for ugadi at tirupati

tirumal tirupati, tirupati balaji, ugadi festival, panchanga sravanam, ugadi pachadi

arrangement for ugadi at tirupati

tirumala-ugadi.png

Posted: 04/04/2013 09:19 AM IST
Arrangement for ugadi at tirupati

tirupati-balaji

సమాజం ఇంత ఆధునిక పోకడలు పోతున్నా మనం ఇంకా పాటిస్తున్నవి కొన్ని ఉన్నాయి. అందులో ఇంకా జీవించివున్నవి- ఉదయాన్నే ఉగాది పచ్చడి తినటం, ఆరోజు పంచాంగ శ్రవణం వినటం.

ఉగాది ఇంకా సరిగ్గా వారం రోజులుంది. ఇప్పటినుంచీ పర్వదినాన్ని సజావుగా జరుపుకునేందుకు సర్వ సన్నాహాలూ జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఆలయాలన్నీ అందుకు కావలసిన ఏర్పాట్లను చేసుకుంటున్నాయి. భక్తుల రద్దీని, చెయ్యవలసిన తంతుని కూడా సరిగ్గా నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.

కలియుగ ప్రత్యక్ష దైవంగా, అతి సంపన్నుడిగా పేరుగాంచిన తిరుమల వాసుని చెంత ఏర్పాట్లకు కొదవేముంటుంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి దగ్గర ఆస్థానం, పంచాంగ శ్రవణం కార్యక్రమాలు జరపటానికి నిర్ణయించుకున్నారు. దీని కారణంగా ఆరోజు తిరుప్పావడ, కళ్యాణోత్సవం, వూంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవ సేవలను రద్దుచెయ్యటం జరిగింది.

మరి ఉగాది పర్వదినానికి ముందే శుభ్రపరచుకునే కార్యక్రమాన్ని చెపట్టాలి కదా. అందుకే 9 వ తారీఖున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం చెయ్యటానికి నిర్ణయించుకున్నారు. దాని వలన ఆరోజు కూడా దైనందిన కార్యక్రమాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. అందులో ఒకటి, 6 గంటల నుంచి 11 గంటల వరకు స్వామి దర్శనానికి అనుమతించరు.

ఉగాది గురువారం అవటం వలన, దానికి అటుగాని ఇటుగాని కొన్ని రోజులను జోడించి దూరంలో ఉండే తనవాళ్ళతో గడపటానికి కొందరు ప్రణాళికలు వేసుకుంటే, మరికొందరు శలవుల్లో దైవదర్శనానికి తిరుపతి ప్రయాణం పెట్టుకునేవారు మరికొందరుంటారు. అలాంటి వాళ్ళకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలోని ప్రధాన కార్యక్రమాన్ని పై విధంగా ప్రకటించారు.

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cattle stealingpng
Rapes and molestations faced from known persons  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles