Electricity problem to be discussed by govt today

electricity problem, electricity charges hike, state govt, chief minister, kiran kumar reddy, opposition parties

electricity problem to be discussed by govt today

elec-shortage.png

Posted: 04/04/2013 10:26 AM IST
Electricity problem to be discussed by govt today

kiran-kumar-photo

ఈరోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరపనుంది. అందులో విద్యుత్ సమస్య మీద చర్చలు జరుగుతాయి. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల పెంపుకి వ్యతిరేకంగా ఇప్పటికే చెలరేగుతున్న నిరసన జ్వాలలు ప్రభుత్వ మనుగడకే ఎసరు పెట్టకముందే ప్రతిపక్షం వాళ్ళంతా కలిసి మెడలు వంచినట్టు కాకుండా, ఇందిరమ్మ బాట, ఇతర కార్యక్రమాలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్తూ వస్తున్నట్టుగా పేదల మీద భారం పడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలన్న విషయంలో ఆలోచనలు చెయ్యబోతున్నారు. బహుశా సాయంత్రం వరకు విద్యుత్ ఛార్జీల విషయంలో ఏమైనా శుభవార్త వినవచ్చునేమో.

ఇప్పటి వరకూ వినపిస్తున్న మాటలను బట్టి, ఉచిత విద్యుత్ లో మార్పుల ఉండబోవు, 150 యూనిట్ల వరకూ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వమే రాయితీ ఇచ్చి భరించవచ్చు. విద్యుత్ సమస్య దేశవ్యాప్తంగా ఉన్న సమస్యని, ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలా అని చూడాలి కానీ ఇందులో రాజకీయం చెయ్యటం తగదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ నిన్న అన్నారు.

అయితే మనలో మన మాట, ప్రతిపక్షాలు ఆందోళన చేసేదే ప్రభుత్వం మీద వత్తిడి పెంచి నిర్ణయాలు తీసుకోవటం కోసం. చేసేది ప్రభుత్వమే, అందులో వివాదం లేదు. కానీ చెయ్యవలసిన అగత్యం ఏర్పరుస్తున్నవి మాత్రం ప్రతిపక్షాలు. ఎంత గంగి గోవైనా పితకకుండా పాలివ్వదు. అడగందే అమ్మైనా బువ్వ పెట్టదనే సామెతెలాగూ ఉండనే ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T leaders arrested in sadak bund attented court today
Cattle stealingpng  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles